Breaking News

వాజేడు

జ్ఞానగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

జ్ఞానగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

సారథి, వాజేడు: స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే స్వేరోస్​ జ్ఞానగర్జన కార్యక్రమం పోస్టర్లను పెనుగోలు కాలనీ అంగన్​వాడీ కేంద్రంలో టీచర్ పాయం నాగలక్ష్మి పిల్లలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేజీబీవీ, మినీ గురుకులం స్కూళ్లలో సిబ్బందితో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. వాజేడు సర్పంచ్, జడ్పీటీసీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది చేతులమీదుగా పోస్టర్లను విడుదల చేశారు. జ్ఞానగర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ కుమార్​ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ములుగు […]

Read More
క్షయ నిర్మూలనలో ఉత్తమ సేవలు

క్షయ నిర్మూలనలో ఉత్తమ సేవలు

సారథి న్యూస్, వాజేడు: క్షయ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్​ కృష్ణ ఆదిత్య పలువురు వైద్యసిబ్బందిని సత్కరించారు. పీవో హన్మంత్ జెండగే, డిప్యూటీ కలెక్టర్ ఆదర్శ్ శురభి, డీఎంహెచ్​వో అప్పయ్య, ప్రోగ్రామ్​ ఆఫీసర్​ డాక్టర్​ రవీందర్​ చేతులమీదుగా వైద్యులు, సిబ్బందిని సన్మానించి ప్రశంసపత్రాలు అందజేశారు. వాజేడు ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి వారికి మందులు పంపిణీ చేసినందుకు హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, పేరూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉత్తమ […]

Read More
స్కూలు, కాలేజీల్లో కరోనా టెస్టులు

స్కూలు, కాలేజీల్లో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ లోని విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్టాఫ్​, స్టూడెంట్స్​కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. డాక్టర్​ యుమున ఆధ్వర్యంలో అనంతరం కోయవీరపురం, దూలపురం, కొంగల గ్రామాల్లో మెడికల్​ టెస్టులు చేశారు. మొత్తం 75మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్ గా రిపోర్ట్​ వచ్చింది. కార్యక్రమంలో డాక్టర్ యమున, సీఎచ్ వో. సూర్యప్రకాష్, […]

Read More
రక్తమోడిన రోడ్లు

రక్తమోడిన రోడ్లు

రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు తెలంగాణ, చత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ట్రాక్టర్ బోల్తా జగన్నాథపురం ‘వై’జంక్షన్ లో కారుబోల్తా సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం రెండు చోట్ల వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టేకులగూడెం బీరయ్య గుట్ట సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి 16మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వరంగల్లు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరంతా గురువారం కోయవీరపురం పెళ్లి రిసెప్షన్ కు వచ్చి వెళ్తుండగా ఈ […]

Read More
క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

సారథి న్యూస్, వాజేడు: మండలంలోని కొంగల గ్రామంలో జగన్నాథపురం సబ్ సెంటర్ లో ఏసీఎఫ్ క్యాంపు నిర్వహించారు డాక్టర్ యమున. ఈ సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం, తేమడతో రక్తంపడడం, ఆకలి మందగించడం వంటి వారిని గుర్తించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. కార్యక్రంమంలో డాక్టర్ మంకిడి వెంకటేశ్వర రావు, సర్పంచ్ శివరామకృష్ణ, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎస్టీఎస్ వెంకటేశ్వరరావు, ఎస్.రవి, ఎల్ టి.రజినీకాంత్ పాల్గొన్నారు.

Read More
చత్తీస్ గఢ్ కూలీలకు మెడికల్​టెస్ట్​

చత్తీస్ గఢ్ కూలీలకు మెడికల్ ​టెస్ట్​

సారథి న్యూస్, వాజేడు: వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుందరయ్య కాలనీకి సమీపంలో ఉన్న మిరప తోటలో పనిచేస్తున్న 22 మంది చత్తీస్ గఢ్​కూలీలకు బుధవారం వైద్యసిబ్బంది మెడికల్​ టెస్టులు చేశారు. కరోనా, వడదెబ్బ తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు హెల్త్​క్యాంపు నిర్వహించినట్టు తెలిపారు. కూలీలకు మలేరియా టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. అలాగే వారికి మందులు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్స్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎచ్ఏ శేఖర్, భాగ్యలక్ష్మి, […]

Read More
చీకుపల్లిలో దోమతెరల పంపిణీ

చీకుపల్లిలో దోమతెరల పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చీకుపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం సుమారు 189 దోమ తెరలను పంపిణీ చేశామని డాక్టర్ యమున తెలిపారు. మలేరియా రాకుండా గ్రామంలో దోమల మందు చల్లినట్లు తెలిపారు. క్రమంలో సబ్ యూనిటీ అధికారి శరత్ బాబు,హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్ర కుమారి, సెక్రటరీ శిరీష, ఆశా కార్యకర్త. అంగన్​వాడీ టీచర్​, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
క్రికెట్ చాంపియన్​కొంగాల టీమ్​

క్రికెట్ చాంపియన్ ​కొంగల టీమ్​

సారథి న్యూస్, వాజేడు: మండల కేంద్రంలోని కొంగలలో శ్రీరాములు, బొల్లె ప్రసాద్, బెల్లాల అజయ్ రాంరెడ్డి స్మారకార్థం జగన్నాథపురం యూత్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్​ టోర్నమెంట్​లో కొంగల జట్టు చాంపియన్​గా నిలిచింది. ఈ టోర్నీలో వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం మండలాల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్​లో భాగంగా కొంగల కింగ్స్ లెవెన్, జగన్నాథపురం రైజింగ్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొంగల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 127 […]

Read More