- రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు
- తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో ట్రాక్టర్ బోల్తా
- జగన్నాథపురం ‘వై’జంక్షన్ లో కారుబోల్తా
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం రెండు చోట్ల వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టేకులగూడెం బీరయ్య గుట్ట సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి 16మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వరంగల్లు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరంతా గురువారం కోయవీరపురం పెళ్లి రిసెప్షన్ కు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం జగన్నాథపురం జంక్షన్లో వెంకటాపురం నుంచి వస్తున్న కారు పల్టీ కొట్టడంతో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.