Breaking News

స్కూలు, కాలేజీల్లో కరోనా టెస్టులు

స్కూలు, కాలేజీల్లో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ లోని విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్టాఫ్​, స్టూడెంట్స్​కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. డాక్టర్​ యుమున ఆధ్వర్యంలో అనంతరం కోయవీరపురం, దూలపురం, కొంగల గ్రామాల్లో మెడికల్​ టెస్టులు చేశారు. మొత్తం 75మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్ గా రిపోర్ట్​ వచ్చింది. కార్యక్రమంలో డాక్టర్ యమున, సీఎచ్ వో. సూర్యప్రకాష్, ఎచ్ ఎస్.రావుకోటిరెడ్డి, ఎచ్ వీ ఈశ్వరమ్మ, ఏఎన్ఎంలు. నాగేంద్ర కుమారి, ఛాయాదేవి, ఎచ్ఏఎస్ చిన్నవెంకటేష్ ,శేఖర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.