Breaking News

రామాయంపేట

శ్రీరామ నిధి సేకరణ

శ్రీరామ నిధి సేకరణ

సారథి న్యూస్, రామయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ నిధిని సేకరించారు. కార్యక్రమంలో ఆకుల రమేష్, ఆకుల రాజు, ఎడ్ల నరసింహారెడ్డి, బుచ్చనరేష్, సంతోష్, ఆకుల భాను తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజాంపేట పట్టణంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ రూ.21,116 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బా సత్యనారాయణ, రామాయంపేట ఖండ […]

Read More
సొంత ఖర్చులతో వాటర్​ ప్లాంటు ఏర్పాటు

సొంత ఖర్చులతో వాటర్​ ప్లాంటు ఏర్పాటు

సారథి న్యూస్, రామాయంపేట: నీటి సౌకర్యం లేని గ్రామాల్లో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించామని స్ట్రీట్ కేస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్ అనే ఎన్జీవో(హైదరాబాద్)కు చెందిన సభ్యులు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఖాసీంపూర్ ప్రైమరీ స్కూలు ఆవరణలో స్థానిక ఎస్సై ప్రకాష్ గౌడ్ చేతులమీదుగా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఖాసీంపూర్ గ్రామంలో నీటి సౌకర్యం సరిగ్గా లేదని గుర్తించి.. నిధులు సేకరించి వాటర్​ప్లాంట్​ను ఏర్పాటు చేశామని వివరించారు. […]

Read More
‘కోరుట్ల ఎమ్మెల్యే సారీ చెప్పాలే’

కోరుట్ల ఎమ్మెల్యే సారీ చెప్పాలే

సారథి న్యూస్, రామయంపేట: అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరాముడి ఆలయానికి విరాళాల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాముడి గుడి ఎక్కడ కట్టినా విరాళాలు ఇవ్వడానికి ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో శేఖర్, నరేశ్, మహంకాళి, నరేష్ రెడ్డి, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. […]

Read More
స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు

స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఫిబ్రవరి 1 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూలును సందర్శించారు. విద్యార్థులు, టీచర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్​గేరుగంటి అనూష, సెక్రటరీ అంజయ్య, పాఠశాల చైర్మన్ కొమ్మట బాగులు, హెచ్ఎం శ్రీనివాస్, టీచర్లు విజయ్ కుమార్, విజయ్ కృష్ణ, […]

Read More
ఘనంగా గోదాదేవి కల్యాణం

ఘనంగా గోదాదేవి కల్యాణం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ ​జిల్లా రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో తిరుమల స్వామి ఆలయంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కల్యాణం వేదపండితులు వాసుదేవచారి, హర్షవర్ధన్ చారి, అర్చకుల సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీని నియమించారు. నస్కల్ శాఖ ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడిగా గందే రాములును నియమించారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్​ పబ్బ సత్యనారయణ, ఉమ్మడి జిల్లా సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేష్, నిజాంపేట మండల ప్రముఖ్​ కొమ్మట నరేందర్, బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, తిరుపతి పాల్గొన్నారు.

Read More
మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, రామాయంపేట: మానవతా హృదయం పరిమళించింది. ఆపదలో ఉన్నవారికి చేయూతనందించింది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న 20 మంది ఫ్రెండ్స్ కలిసి హెల్పింగ్ హ్యాండ్స్​గ్రూప్ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇటీవల మెదక్​ జిల్లా రామాయంపేట చల్మేడ గ్రామానికి చెందిన రైతు తిర్మలయ్య ఇటీవల మరణించాడు. గ్రూపు మెంబర్స్ లో ఒకరైన సోదరుడికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ వారి ఆర్థిక పరిస్థితిని వివరించారు. హెల్పింగ్ హ్యాండ్స్​ […]

Read More
పీవోఎస్ మిషన్ల ద్వారానే ఎరువులు అమ్మాలి

పీవోఎస్ మిషన్లతోనే ఎరువులు అమ్మాలి

సారథి న్యూస్, రామయంపేట: రైతులకు యాసంగి సీజన్ లో అవసరమైన ఎరువులను పీవోఎస్ మిషన్ల ద్వారానే విక్రయించాలని మెదక్ డీఏవో పరుశురాం నాయక్ ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. శనివారం మెదక్​ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుకాణాల వద్ద స్టాక్ వివరాలు, ధరల పట్టికలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించొద్దని హెచ్చరించారు. చలి నుంచి వరి […]

Read More