సారథి న్యూస్, కర్నూలు: క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, భవిష్యత్‌లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీయేనని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఉద్ఘాటించారు. శనివారం సాయంత్రం నగరంలోని లక్ష్మిహోటల్ పక్కన పార్టీ కర్నూలు జిల్లా ఆఫీసును ఎంపీ టీజీ వెంకటేష్‌తో పాటు సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, రాష్ట్రంలోనూ […]
సారథి న్యూస్, కర్నూలు: ఇండియా బోర్డర్లోని గాల్వాన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్యకు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి వస్తువులను బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించే అవకాశం భారత ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ప్రతిఒక్కరికీ కల్పించారని పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి పౌరుడు మేడిన్ ఇండియా వస్తువులనే కొనాలని కోరారు.
సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా వైరస్ ను అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ హుస్నాబాద్ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. సోమవారం అక్కన్నపేట హెల్త్‌సెంటర్ ఎదుట ఆందోళన చేపట్టారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు, పోలీసులు అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్నవారికి కోవిడ్-19 టెస్టులు చేయాలన్నారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. బిజెపి నాయకులు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కళ్యాణ్, సాయిరాం పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట/రామడుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది. కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరింది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ దవాఖాన ఎదుట, కరీంనగర్ జిల్లా రామడగులోనూ బీజేపీ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో రామడుగు బీజేపీ మండల అధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, రామయంపేట […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: భారత్– చైనా సరిహద్దులో అమరుడైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంతోష్ బాబు చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ యాదగిరి యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, చారి, జనార్దన్, ఉగాది బల్లు, పిడుగు ప్రవీణ్, ప్రేమ్, ఉజ్వల్ శివాజి, శంకర్, […]
సారథి న్యూస్, రామడుగు: లాక్ డౌన్ నేపథ్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రామడుగు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. జిట్టవేని అంజిబాబు, డబుల్ కార్ రాజు, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేంద్రాచారి, ఎడవెళ్లి లక్ష్మణ్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలను సడలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఎస్పీ సునిల్ దత్తును మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం వ్యాపారానికి, హోల్ సెల్ దుకాణాలకు కేంద్రబిందువుగా ఉందని, వాహనాలకు చలాన్లు వేస్తే షాపులకు ఎవరూ కావడం లేదని వివరించారు. అసలే కరోనా, లాక్ డౌన్ సమయంలో గిరాకీ రాక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ దృష్టికి తెచ్చారు. వ్యాపారులకు సహకరిస్తామని ఎస్పీ బీజేపీ నాయకులకు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. మంగళవారం కట్కూర్ గ్రామంలో మోడీ పాలనపై ఇంటింటా ప్రచారంలో మాట్లాడారు. దేశంలో సుదీర్ఘంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారని చెప్పారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్తీక్, రాహుల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.