ముంబై: అయోధ్యలో రామమందిరం నిర్మాణం శుభపరిణామమని శివసేన అభిప్రాయపడింది. ప్రధాని చేతుల మీదుగా బుధవారం భూమిపూజ చేయాల్సిన మంచి క్షణం మరొకటి లేదని, శ్రీరాముని దయ వల్ల కరోనా కనుమరుగు అవుతోందని చెప్పింది. రామమందిర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వయోభారం వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని చెప్పింది. అయోధ్యలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారని, హోం మంత్రిత్వ శాఖ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోందని […]
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఆగస్టు 1 నుంచి ‘కిసాన్ సమ్మాన్ నిధి’ డబ్బులు ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులకు మరోసారి తీపికబురు చెప్పింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా అందిస్తున్న డబ్బును మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేయనుంది. ఆగస్టు 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.రెండు జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధాని మోడీ సర్కారు రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్‌సమ్మాన్ నిధి స్కీం ద్వారా వారికి […]
జాతీయ విద్యావిధానానికి కొత్త హంగులు వృత్తి, ఉపాధి లభించేలా నూతన వ్యవస్థ కేంద్రం మానవ వనరుల శాఖ.. ఇక విద్యామంత్రిత్వ శాఖగా మార్పు ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి అన్నారు. 2021లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో ప్రధాని ఏపీకి 11 లక్షల ఇళ్లు కేటాయించారని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయాంలో అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో రూ.ఏడువేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. […]
ఈ పరిస్థితుల్లో నైపుణ్యమే కీలకం వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనకు సరికొత్త చాలెంజ్‌లను విసిరిందని, దాన్ని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బుధవారం వరల్డ్ యూత్ స్కిల్ డేను పురస్కరించుకుని యువతను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. నైపుణ్యం అనేది చాలా కీలకమైందని, ఇలాంటి సమయంలోనే యువత తమ స్కిల్స్‌కు పదును పెట్టాలని మోడీ చెప్పారు. ‘మీ స్కిల్స్‌ను నిరూపించుకునేందుకు ఈ రోజును అంకితమిచ్చారు. కొత్త కొత్త […]
న్యూఢిల్లీ: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైనికుల్లో చాలా ధైర్యం నింపిందని ఐటీబీపీ చీఫ్ ఎస్ ఎస్.దేశ్వాల్ అన్నారు. ‘ప్రధాని పర్యటన సైనికుల్లో చాలా ధైర్యాన్ని నింపింది. ఆయన ప్రసంగం చాలా బలాన్ని ఇచ్చింది. దేశంలోని పొలిటికల్ లీడర్ షిప్, ఆర్మీ జవాన్లు దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్లంతా సరిహద్దు భద్రతకు అంకితమయ్యారు. భారత సైన్యం, వైమానిక దళం, ఐటీబీపీలోని సైన్యానికి మనోధైర్యం చాలా ఎక్కువ’ అని ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్ […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన సైనికుల్లో మరింత ధైర్యాన్ని నింపిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి థ్యాంక్స్ చెప్పారు. ‘లద్దాఖ్ వెళ్లడం, సోల్జర్స్‌ను కలుసుకుని వాళ్లను ఎంకరేజ్ చేయడం సైనికుల్లో కచ్చితంగా ధైర్యాన్ని పెంచింది. ఆర్మీ చేతుల్లో బోర్డర్స్ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి’అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు. గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత మోడీ మొదటిసారి […]
లద్దాఖ్: ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. గాల్వాన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఇక్కడ పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీటింగ్‌లో ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. జవాన్లు తమ ధైర్య సాహసాలతో ప్రపంచానికి ఇండియా బలం గురించి సందేశం పంపారని మెచ్చుకున్నారు. శత్రువులకు మీ ఆవేశం, ఆగ్రహాన్ని రుచి చూపించారని కితాబునిచ్చారు. ‘మీరు పనిచేస్తున్న చోటు కంటే మీ తెగువ […]