Breaking News

పాలకొండ

నాటుసారా తయారీని అడ్డుకుందాం

నాటుసారా తయారీని అడ్డుకుందాం

సారథి న్యూస్​, పాలకొండ: పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలకొండ, వీరఘట్టం, రేగిడి ఆమదాలవలస మండలం, సచివాలయంలో ఉన్న ఉమెన్స్ ప్రొడక్షన్ (మహిళా పోలీసులు) తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ పీఎం శ్రావణి మాట్లాడుతూ.. నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సమష్టి కృషితో పనిచేయాలన్నారు. ప్రజలతో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ జి.శంకర్​రావు, పాలకొండ ఎస్సై ఆర్ జనార్దన్ రావు, వీరఘట్టం మండలం […]

Read More
హక్కుల కోసం కలిసిరావాలి

హక్కుల కోసం కలిసిరావాలి

పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్​సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.

Read More
దెబ్బతిన్న పంటల పరిశీలన

దెబ్బతిన్న పంటల పరిశీలన

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలస పంచాయతీ మల్లంగూడలో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. సుమారు 20 ఎకరాల పత్తి పంటకు నష్టం కలిగిందని, అధికార యంత్రాంగం పంటనష్టం అంచనా వేయాలని డిమాండ్​చేశారు. సీపీఎం బృందంలో దూసి దుర్గారావు, కాద రాము, ఎస్.భానుసుందర్, కరువయ్య, సాంబయ్య పాల్గొన్నారు.

Read More
వ్యవసాయాన్ని పండగలా చేస్తాం

వ్యవసాయాన్ని పండగలా చేస్తాం

సారథి న్యూస్, పాలకొండ(శ్రీకాకుళం): రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చెరుకు రైతుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇది రైతన్నల ప్రభుత్వమని, విద్య, వైద్యం, వ్యయసాయం, సంక్షేమాలపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తుందన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. జిల్లాలో చెరుకు పంట విస్తీర్ణం పెంచాలన్నారు. తద్వారా చెరుకు ఫ్యాక్టరీ […]

Read More
ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: బీజేపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సచివాలయ ఆవరణలో సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దావాల రమణారావు, ఎన్ఏ రాజపురం శాఖ కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ అమలు దేశప్రజల ఆర్థిక పరిస్థితిని తీరోగమనంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాక్​డౌన్​విధించి వలస కార్మికుల […]

Read More