Breaking News

నిజాంపేట

కరోనాతో సర్పంచ్ మృతి

కరోనాతో సర్పంచ్ మృతి

సారథి, రామాయంపేట: కరోనా బారినపడి మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామ సర్పంచ్ కర్రెయ్య(63) చనిపోయారు. కొవిడ్​ నిర్ధారణ కావడంతో రామయంపేటలోని ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిరోజూ ఉదయం టీవీఎస్ మోటార్ సైకిల్ పై గ్రామంలో వాడవాడలా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకునే వాడని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More
పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం

పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం

సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన శాంభవ మల్లేశం(50) మరణించారు. విషయం తెలుసుకున్న నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదువేల ఆర్థిక సహాయంతో పాటు 50కేజీల బియ్యం అందించారు. ఆయన వెంట నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, నీలం తిరుపతి, నూర్​ బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఉన్నారు.

Read More
ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

సారథి, రామయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో ఇల్లంతల శ్రీను అనారోగ్యంతో ఇటీవల చనిపోయాడు. వారి కుటుంబానికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయకుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపి తనవంతు సహాయంగా రూ.ఐదువేల నగదు, 50 కిలోల బియ్యం, ఐదు లీటర్ల వంటనూనె అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి లబ్దిపొందే ప్రతి సహాయానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ క్రిష్ణవేణి మధుసూదన్​ రెడ్డి, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, […]

Read More
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సారథి, నిజాంపేట: నిజాంపేట మండలంలోని బచ్చురాజిపల్లి గ్రామంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచు నర్సవ్వస్వామి, ఎంపీటీసీ లద్ద సురేష్, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి రామావత్ లక్ష్మి, గ్రామరైతులు పాల్గొన్నారు.

Read More
గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం

గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం

సారథి న్యూస్​, నిజాంపేట: తడి, పొడి చెత్తసేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పల్లెప్రగతి పనులను యాప్ లో నమోదు చేయాలని మెదక్ జిల్లా సీఈవో వెంకట శైలేష్ సూచించారు. శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఆయన పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాయని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్ కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాల్గొన్నారు

Read More
రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

సారథి న్యూస్, నిజాంపేట/పెద్దశంకరంపేట: అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఊరూరా నిధుల సేకరణ చేస్తున్నారు. శుక్రవారం మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వీహెచ్ఎస్​ అధ్యక్షుడు రమేశ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు చెర్విరాల ప్రవీణ్ కుమార్, నరేష్, రాజు, నవీన్, విజయ్ మోహన్ పాల్గొన్నారు. అలాగే పెద్దశంకరంపేటలో శేషాచారి కుమారులు రామచంద్రాచారి, వేణుగోపాల్ చారి, మురళి పంతులు రామమందిరం నిర్మాణానికి రూ.51,116 అందజేశారు. […]

Read More
అధిక దిగుబడికి సస్యరక్షణ చర్యలు తప్పనిసరి

అధిక దిగుబడికి సస్యరక్షణ తప్పనిసరి

సారథి న్యూస్, రామాయంపేట: వరి పంటలో అధిక దిగుబడులకు సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీష్​రైతులకు సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. వరి పంటను మొగిపురుగు ఆశిస్తే మొదటగా 3జీ లేదా 4జీ గుళికలను ఎకరాకు ఆరు లేదా 8 కిలోల చొప్పున చల్లుకోవాలని సూచించారు. అగ్గితెగులు ఆశించినట్లయితే ట్రైసాక్లోజల్ 0.6 గ్రాములు లేదా 2.25 ఎం.ఎల్ కాసుమిసిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో […]

Read More
ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

సారథి న్యూస్, రామాయంపేట: బీసీల అదృష్టం.. మన నుదిటి గీతలో చేతి రాతల్లో లేదని.. మనం వేసే ఓట్లలోనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం మెదక్ ​జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహన్ని ఆవిష్కరించారు. మనిషిని మనిషిగా చూడాలని.. మనిషిగా గౌరవించాలని కలలు గన్న గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. ఓట్లంటే తెల్లకాగితం.. కంప్యూటర్ బటన్ […]

Read More