Breaking News

నారాయణఖేడ్

చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం పిప్రితండాకు చెందిన మారోని బాయ్ (55)కి బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె అర్ధరాత్రి సమయంలో చనిపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు […]

Read More
బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయం

బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని మార్కెట్ పల్లి గ్రామానికి చెందిన యాదగిరికి ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.15వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ రమ్యఅశోక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.

Read More
కరెంట్ ఆఫీసర్లు సతాయిస్తుండ్రు

కరెంట్ ఆఫీసర్లు సతాయిస్తుండ్రు

సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ప్రమాదాలకు నిలయంగా ఇంటిపై వేలాడుతున్న వైర్లను తొలగించాలని, సంబంధిత కరెంట్ ​ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామస్తులు ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్​సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. స్తంభాల కింద వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఏఈ మోతిరాంకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ చంద్రవ్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా […]

Read More
బాత్ రూంలకు దారేది?

బాత్ రూంలకు దారేది?

సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ఆడపడుచుల ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాత్ రూంల నిర్మాణంలో భారీస్థాయిలో గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామానికి మంజూరైన బాత్ రూంలు ఇష్టారీతిలో నిర్మించి రూ.లక్షల్లో బిల్లులు స్వాహాచేసినట్లు ఉన్నతాధికారులకు తడ్కల్ గ్రామానికి చెందిన సోలంకార్ రాజు ఫిర్యాదు చేశాడు. బాత్ రూంల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన సెక్రటరీలు, వారికి సపోర్టుచేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని గతంలో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు […]

Read More
నల్లవాగుకు జలకళ

నయనానందకరం నల్లవాగు

నారాయణఖేడ్, సారథి న్యూస్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్ట్​ జలకళను సంతరించుకున్నది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి నల్లవాగుకు పూజలు చేశారు. అనంతరం గేట్​ను ఎత్తి నీటి విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్​ రమావత్ రాంసింగ్, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాఘవరెడ్డి, కల్హేర్ జెడ్పీటీసీ నర్సింహా […]

Read More
గాడిదలకు బీమా కల్పించండి.. ఎందుకంటే?

గాడిదలకు బీమా కల్పించండి.. ఎందుకంటే?

సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: కాలం మారుతున్నా కొద్దీ యాంత్రిక శక్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రైతులు వ్యవసాయ పొలంలో దుక్కులు దున్నేకాడి నుంచి పంటను తీసుకెళ్లే వరకు ప్రతిపనిలో యంత్రాలు, ట్రాక్టర్లను వాడుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రైతులు పాతకాలం నాటి పద్ధతులనే వాడుతున్నారు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కే) గ్రామంలో యూరియా, డీఏపీ మందు సంచులు, సేంద్రియ ఎరువులను […]

Read More
జర్నలిస్టులపై దాడులు సరికాదు

జర్నలిస్టులపై దాడులు సరికాదు

సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని సంగారెడ్డి జిల్లా ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు బోర్గి సంజీవ్​ ఆరోపించారు. జర్నలిస్ట్​ తీన్మార్​ మల్లన్నపై దాడిని ఆప్​ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే ఆయనపై ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమ్​ఆద్మీపార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read More

సీసీరోడ్డు పనులు షురూ

సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా(బీ) పంచాయతీలో సీసీరోడ్డు పనులను సర్పంచ్ సాయవ్వ మనోహర్, ఎంపీటీసీ ఇందుమతి మారుతీ శనివారం ప్రారంభించారు. రూ.ఐదులక్షల వ్యయంతో 170మీటర్లు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్​ చేస్తామన్నారు. బాలాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Read More