నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో […]
సామాజిక సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(డీ82) కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా చెరుకూరు, పరిసర గ్రామాల బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో భాగంగా చెరుకూరు, భర్కత్ పల్లి, గానుగట్టుతండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లా అదనపు ఎస్పీగా సృజన ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీపై డీజీపీ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాకు నూతనంగా అదనపు ఎస్పీగా బదిలీపై వచ్చిన నితిక పంత్ కు ఘన స్వాగతం పలికారు. పోలీస్ క్యలాణ మంటపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రమణకుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో నూతన అదనపు ఎస్పీ నితిక పంత్, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ […]
సామాజిక సారథి, ములుగు: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, బస్తాలు, లారీల కొరత లేకుండా వర్షానికి తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అంతించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం […]
సామజిక సారథి, వెంకటాపూర్: పబ్లిక్ టాయిలెట్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని మేడారం జాతరలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ ఐల త్రిపాటి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ (కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్) పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, గ్రామ సర్పంచ్ కుమారస్వామికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సిసి క్రాంతి, ఎంపీడీవో ఎండి ఎక్బాల్ హుస్సేన్, ఈజీఎస్ఏపీఓ నారగోని సునీత, ఈసి సురేష్, […]
అదనపు కలెక్టర్ వీరారెడ్డి సామాజిక సారథి, సంగారెడ్డి: ప్రజావాణిలో వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలతో వచ్చిన సుమారు 50 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ జిల్లా అధికారి రాధికరమణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అర్జిదారులు పాల్గొన్నారు.
– అడిషనల్ ఎస్పీ సందెపొగు మహేందర్ సారథి సిద్దిపేట, ప్రతినిధి: ప్రజలు ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలని అడిషినల్ ఎస్పీ సందెపొగు మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ ఆర్డీవో, ఏఎస్పీ డివిజన్ పరిధిలోని లాక్ డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించి బయట తీరగొద్దన్నారు. డివిజన్ ప్రజలంతా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే తమ […]