Breaking News

క్రీడలు

For more details

శునకంతో షమీ పోటీ

శునకంతో షమీ పోటీ

న్యూఢిల్లీ: లాక్​ డౌన్​తో ఇంకా ఔట్​డోర్​ ప్రాక్టీస్ మొదలుపెట్టని టీమిండియా ఫిట్​నెస్​ కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తోంది. కొంత మంది ఇంట్లో ఉన్న పెరట్లో ప్రాక్టీస్ చేస్తుంటే.. పేసర్ మహ్మద్ షమీ మాత్రం కాస్త భిన్నంగా ప్రయత్నించాడు. తన వేగాన్ని పెంచుకోవడం కోసం పెంపుడు శునకంతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ పరుగులో శునకం కంటే షమీని ఎక్కువగా పరుగెత్తినట్లు కనిపించింది.

Read More
భజ్జీపై నిషేధం వద్దని వేడుకున్నా..

భజ్జీపై నిషేధం వద్దని వేడుకున్నా..

న్యూఢిల్లీ: 2008 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తనను చెంప దెబ్బ కొట్టిన ఘటనలో హర్భజన్​పై నిషేధం వద్దని వేడుకున్నానని మాజీ స్టార్​ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఆ వివాదానికి అంతటితో ముగింపు పలకాలని భావించినట్లు చెప్పాడు. ‘ఆ మ్యాచ్​లో సచిన్ ఉన్న జట్టులోనే హర్భజన్ ఉన్నాడు. నా చెంపపై కొట్టిన తర్వాత మాస్టర్ సీరియస్ అవుతూ వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు మాస్టర్​కు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్ చేశాం. కానీ […]

Read More
టెన్నిస్ స్టార్ ఇవాని సెవిచ్​కు కరోనా

టెన్నిస్ స్టార్ ఇవాని సెవిచ్​కు కరోనా

బెల్​గ్రేడ్​: ప్రపంచ నంబర్​వన్​ జొకోవిచ్ నిర్వహించిన అడ్రియన్ టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లలో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా క్రొయేషియా టెన్నిస్ స్టార్​ గ్రేట్ గొరాన్ ఇవాని సెవిచ్​కు కూడా కరోనా సోకింది. పదిరోజుల క్రితం రెండుసార్లు పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్​గా తేలిందని ఇవానిసెవిచ్ వెల్లడించాడు. లక్షణాలు లేకపోయినా తాను వైరస్ బారినపడ్డానని చెప్పాడు. తనతో సన్నిహితంగా ఉన్న వారంతా ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేయించుకోవాలని […]

Read More
వన్డేల్లో సూపర్ ఓవర్ ఎందుకు

వన్డేల్లో సూపర్ ఓవర్ ఎందుకు

న్యూఢిల్లీ: వన్డేల్లో ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్ ఎందుకు వేయించాలని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్​మెన్​ రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ టై అయితే ట్రోఫీని ఇరుజట్లకు పంచండని సూచించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్​ను దృష్టిలో పెట్టుకుని టేలర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్​లో సూపర్ ఓవర్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మ్యాచ్ టై అయితే దానిని టైగానే పరిగణించాలి. వేగంగా పరిస్థితులు మారే టీ20ల్లో ఇది కుదరకపోవచ్చు. […]

Read More
హఫీజ్​కు మళ్లీ కరోనా

హఫీజ్​కు మళ్లీ కరోనా

కరాచీ: తొలిసారి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలాడు.. తాను స్వయంగా వెళ్లి చేయించుకున్న టెస్టుల్లోనూ నెగెటివ్​గా వచ్చిందన్నాడు.. మూడోసారి జరిపిన పరీక్షలో మళ్లీ పాజిటివ్ అంటున్నారు పాక్ బ్యాట్స్​మెన్​ హఫీజ్. కరోనా వ్యవహారంలో ఎక్కడా స్పష్టత రావడం లేదు. పీసీబీ తొలిసారి నిర్వహించిన టెస్టుల్లో మొత్తం పది మంది క్రికెటర్లకు కరోనా సోకినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. అందులో హఫీజ్ కూడా ఉన్నాడు. అయితే ఈ ఫలితాన్ని మరోసారి ధ్రువీకరించుకోవాలనే ఉద్దేశంతో హఫీజ్ స్వయంగా టెస్టు […]

Read More
నా కెరీర్​లో అదే మలుపు

నా కెరీర్​లో అదే మలుపు

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో సన్​ రైజర్స్​ హైదరాబాద్​కు ఆడడమే తన కెరీర్​లో పెద్దమలుపు అని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ అన్నాడు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పాడు. ‘యార్కర్లు సంధించే నైపుణ్యం నాకు ఎప్పుడూ ఉంది. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ నేర్చుకున్నా. సన్​ రైజర్స్​ హైదరాబాద్ కు మారిన తర్వాత ఇన్నింగ్స్ మొదట, చివర బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. 2014లో ఆ ఫ్రాంచైజీ తరఫున 14 మ్యాచ్​లు ఆడాను. దీంతో స్లాగ్ ఓవర్లలో […]

Read More
మహిళకు తొలిసారి ఎంసీసీ పగ్గాలు

మహిళకు తొలిసారి ఎంసీసీ పగ్గాలు

లండన్: 253 ఏళ్ల చరిత్ర ఉన్న మెరిలోబోన్​ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కు తొలిసారి ఓ మహిళ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతోంది. ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు మాజీ కెప్టెన్ క్లేర్ కానర్ ఈ పదవిని చేపట్టనుంది. ప్రస్తుత అధ్యక్షుడు సంగక్కర.. పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ తర్వాత ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఎండీ(మహిళల విభాగం) గా పనిచేస్తున్న ఆమెను ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం స్వయంగా సంగక్కరనే […]

Read More
ధోనీపై స్పెషల్​ సాంగ్​

ధోనీపై స్పెషల్​ సాంగ్​

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి క్రికెట్ ఆడాలని ప్రపంచ దేశాల క్రికెటర్లంతా కోరుకుంటారు. ఇప్పుడు ఆడుతున్న వారైతే తమ అభిమానాన్ని ఏదో రకంగా చూపెడుతుంటారు. అదే కోవలో వెస్టిండీస్ ఆల్​ రౌండర్​ డ్వేన్ బ్రావో కూడా.. మహీపై తన అభిమానాన్ని పాట రూపంలో వెల్లడించబోతున్నాడు. ‘మహీ సాంగ్’ పేరుతో తానే రాసి, కంపోజ్ చేసిన ఈ పాటను మహీ పుట్టిన రోజు జులై 7న విడుదల చేయనున్నాడు. దానికంటే ముందు పాటకు సంబంధించిన టీజర్​ను సామాజిక […]

Read More