సారథిన్యూస్, మహబూబాబాద్: ప్రజలు మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51 (బీ) చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు గుంపులుగా తిరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ముఖ్యమైన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయల్లో ఎప్పటికప్పడు తనిఖీ చేస్తామని.. మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
సారథిన్యూస్, వరంగల్ అర్బన్: వరంగల్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు వరంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతీ, కుడా […]
సారథి న్యూస్, వరంగల్: కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని టీడీపీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షుడు చిటూరి అశోక్ ఆరోపించారు. కరోనాను అరికట్డడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హన్మకొండలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మాడగాని మనోహర్, కుసుమ శ్యాంసుందర్, మార్గం సారంగం, బర్ల యాకూబ్, గొల్లపల్లి ఈశ్వరాచారి, చిలువేరు […]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ ను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతం ఆదేశించారు. మంగళవారం హరితహారం పల్లెప్రగతి పనులను పరిశీలించేందుకు కేసముద్రం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కేసముద్రం పట్టణం, ఇనుగుర్తి, లాలూ తండా, తౌర్య తండాల్లో పర్యటించి హరితహారం తీరు తెన్నులను పరిశీలించారు. లాలూ తండాలోని 4 ఎకరాల్లో చేపట్టిన అటవీశాఖ నర్సరీని సందర్శించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందన, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీవో రోజా రాణి తదితరులు […]
సారథి న్యూస్, మహబూబాబాద్: గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. జీవో3 అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. జీవో3 అమలైతే 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయపోస్టులను వందశాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాల్సిందేనని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ సూచించారు. రోజు రోజుకు విస్తరిస్తున్న వ్యాధిని నియంత్రించడం కోసం ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ ఇచ్చిన అదేశాలను గౌరవిస్తూ ప్రజలు తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు సమాజ పరిరక్షణకు కృషిచేయాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగితే డిజాస్టర్ మెనేజ్ మెంట్ యాక్ట్ 51(బి) మేరకు కేసులు […]
సారథి న్యూస్, వరంగల్: ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గిరిజన బాలుర కుటుంబాలను ఆన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం మహబూబాబాద్ ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఆమె బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. శనివారం గోడతండాకు చెందిన గిరిజన పిల్లలు ఇస్లావత్ లోకేశ్, రాకేశ్, జగన్, దినేశ్ ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మున్సిపల్ […]
సారథి న్యూస్, వరంగల్(మహబూబాబాద్): ప్రస్తుతం స్కూళ్లు లేకపోవడంతో విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ఆ సరదానే వారి ప్రాణాలు తీస్తోంది. మహబూబాబాద్ మండలం శనగపురం గ్రామశివారు బోడతండా సమీపంలో తుమ్మలచెరువులోకి ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఇటీవల భారీగా వర్షం కురిసింది. దీంతో తుమ్మలచెరువులోకి భారీగా వరదనీరు చేరింది. సమీపంలో ఉన్న బోడ తండాకు చెందిన నలుగురు చిన్నారులు బోడ జగన్(12), బోడ దినేష్(13), ఇస్లావత్ లోకేష్(13), ఇస్లావత్ రాకేష్ (12) ఈతకు వెళ్లారు. నీటిలోకి […]