Breaking News

తెలంగాణ

సర్వాయి పాపన్న జీవితం స్ఫూర్తిదాయకం

సర్వాయి పాపన్న జీవితం స్ఫూర్తిదాయకం

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సామాజిక సారథి, నర్సాపూర్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అణగారినవర్గాల కోసం ఎనలేని కృషిచేసిన గొప్ప వ్యక్తి అని ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆయన బాటలో ప్రతిఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతి ఉత్సవాలను బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల […]

Read More
ఆకలి ఉన్నంతకాలం వ్యవసాయం ఉంటుంది

అప్పటిదాకా వ్యవసాయం ఉంటుంది

నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు సారథి, నర్సాపూర్: ఆకలి ఉన్నంత కాలం వ్యవసాయం అవసరం ఉంటుందని నాబార్డు చైర్మన్ గోవిందరాజులు అన్నారు. గ్రామాల్లో వ్యవసాయం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందన్నారు. రూ.లక్షల కోట్లతో నాబార్డ్ సంస్థ వ్యవసాయరంగానికి చేయూతనిస్తుందన్నారు. విద్యార్థులు ఫీల్డ్ లో నేర్చుకున్న వ్యవసాయ సాంకేతికత దేశానికి ఉపయోగపడాలన్నారు. సోమవారం మెదక్​జిల్లా నర్సాపూర్​ మండలం తునికి గ్రామ శివారులోని విజ్ఞాన జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీ 24వ స్నాతకోత్సవ సభ నిర్వహించారు. డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి, బెయర్ రూరల్ […]

Read More
పునాది తవ్వితే.. బంగారమే బంగారం!

పునాది తవ్వితే.. బంగారమే బంగారం!

పనులు చేస్తుండగా కూలీలకు లభ్యం ఒకేచోట 100కు పైగా నాణేలు వెలుగులోకి.. వాటి విలువ రూ.కోటిపైమాటే సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో శివాలయం పక్కన జనార్ధన్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇల్లును కడుతుండగా, పునాదుల్లో బంగారు ఆభరణాలు, నాణేలు లభించాయి. అసలు విషయం ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలు తలా పంచుకున్నారు. అసలు విషయం బుధవారం వెలుగుచూసింది. పునాదులు తవ్వడానికి 10 మంది కూలీలు పనిచేశారు. అందులో […]

Read More
దంచికొడుతున్న వాన

దంచికొడుతున్న వాన

ఏకమైన వాగులు, వంకలు.. నిండుకుండలా చెరువులు, కుంటలు లోతట్టు ప్రాంతాలు జలమయం పలుచోట్ల వాగుల్లో కొట్టుకుపోయినవారిని కాపాడిన పోలీసులు సారథి ప్రతినిధి, జగిత్యాల/జగిత్యాల రూరల్/వేములవాడ/పెద్దశంకరంపేట/నాగర్​కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ, గోదావరి నదుల్లోకి నీటి ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కుండపోత వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతరం- గుల్లపేటవాగు పైనుంచి వెళ్తుండగా వరద ఉధృతికి కారు […]

Read More
‘ధరణి’తో ఆ బాధలు తీరినయ్​

‘ధరణి’తో ఆ బాధలు తీరినయ్

సారథి, రామడుగు: గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని భూములను డిజిటలైజేషన్ చేయడం శుభపరిణామమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్​జిల్లా రామడుగు మండల తహసీల్దార్ ఆఫీసులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రైతులకు విశ్రాంతి గది, రక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రెనవేషన్ రూములను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు […]

Read More
నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి

నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి

సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ ​జిల్లా కేంద్రంలో ‘దిశ’ సమీక్ష సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిందని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని, ఉద్యోగం అంటేనే […]

Read More
ఎంపీటీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్దాం

సీఎం దృష్టికి ఎంపీటీసీల సమస్యలు

సారథి, హైదరాబాద్: హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొని పలు తీర్మానాలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను కలిసి సీఎం కేసీఆర్ ​వద్దకు వెళ్లి తమ సమస్యలను విన్నవించాలని, అన్ని జిల్లాల్లో కలెక్టర్ లకు వినతిపత్రం ఇవ్వాలని, ఆగస్టులో హైదరాబాద్ లో ఎంపీటీసీల సభ […]

Read More
రేవంత్​ప్రమాణ స్వీకారానికి తరలిన లీడర్లు

రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలిన లీడర్లు

సారథి, పెద్దశంకరంపేట/గొల్లపల్లి/రామడుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమానికి తరలిన వారిలో రాయిని మధు, జనార్ధన్, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, నారాగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజునాయక్, సాయిరెడ్డి, రఘుపతిరెడ్డి, రాంచందర్, […]

Read More