Breaking News

జాతీయం

గర్జించిన రైతులోకం

గర్జించిన రైతులోకం

సాగుచట్టాలపై ఉద్యమానికి ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో మార్మోగిన నినాదాలు మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌ న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గతవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దుచేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసన […]

Read More
ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

కాంగ్రెస్​నేత రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సూచించారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా […]

Read More
సమాజంలో అందరి సంక్షేమమే లక్ష్యం

సమాజంలో అందరి సంక్షేమమే లక్ష్యం

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: మాజంలో ఏ ఒక్కరూ వెనకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్తలకు నివాళర్పిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్‌ 26 చారిత్రక దినం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశతత్వాన్ని రాజ్యాంగ పీఠిక ప్రతిబింబించిందని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే.. ఒకరి కోసం అందరం ఉన్నామని చెప్పారు. సవాళ్లకు అనుగుణంగా […]

Read More
మీకు నైతికహక్కు లేదు

మీకు నైతికహక్కు లేదు

రాజ్యాంగ నిబంధనలకు మోడీ సర్కార్‌ తూట్లు అందుకే మేము పాల్గొనడం లేదు: మాయావతి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించే నైతిక హక్కు లేదని, అందుకే ఈ కార్యక్రమాల్లో తమ పార్టీ పాల్గొనడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని పూర్తి నిబద్ధతతో అనుసరిస్తున్నామా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సమీక్షించుకోవాలని […]

Read More
15నుంచి విదేశాలకు విమానసర్వీసులు

15నుంచి విదేశాలకు విమానసర్వీసులు

ఇంటర్​ నేషనల్​ విమాన సేవల పునరుద్ధరణ కొత్త వేరియంట్‌ కారణంగా 14 దేశాలకు రద్దు న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన ఇంటర్​నేషనల్‌  విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 15 నుంచి విదేశాలకు రెగ్యులర్‌ సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే 14 దేశాలకు మాత్రం విమానాలను ఇప్పుడే నడపబోవడం లేదని ఏవియేషన్‌ మంత్రిత్వశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా వైరస్‌ తీవ్ర ఎక్కువగా ఉన్న, కొత్త […]

Read More
ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)​భావజాలం కలిగిన నేతలు ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. శుక్రవారం జూమ్ ద్వారా నిర్వహించిన సోషల్ మీడియా విభాగం కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. సంఘ్ భావజాలం ఉన్న కాంగ్రెస్ నేతలకు తలుపులు తెరిచే ఉన్నాయని, ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవచ్చన్నారు. ‘ఇక్కడ చాలా మంది […]

Read More
ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారుచేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ  వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ […]

Read More
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

సారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ […]

Read More