Breaking News

జాతీయం

అయోధ్యకు బయలుదేరిన ప్రధాని

పంచెకట్టులో ప్రధాని మోడీ

అయోధ్య: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలుదేరారు. రోజువారి వస్త్రధారణకు భిన్నంగా మోడీ పంచెకట్టులో కనిపించారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్‌లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. తొలుత ఆయన హనుమాన్‌ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అయోధ్యను అధికారులు అణువణువునా శానిటైజ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రంగురంగుల పూల […]

Read More
శివాజీరావు పాటిల్​ మాజీ సీఎం

మహారాష్ట్ర మాజీసీఎం కన్నుమూత

ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలాంగేకర్ (88) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో పూణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. శివాజీరావుకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడంతో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నా కిడ్నీ ఫెయిలవ్వడంతో బుధవారం తెల్లవారుజామున మరణించారని వైద్యులు చెప్పారు. శివాజీరావు మధుమేహం, బీపీ, కరోనాలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు […]

Read More
యోగీ స్పీచ్​ అయోధ్య

దశాబ్దాల పోరాట ఫలితమది

అయోధ్య: ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితంగానే అయోధ్యలో రామమందిరం నిర్మించుకోబోతున్నామని ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి మాట్లాడుతూ.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామాలయ కల సాకారమైందని చెప్పారు. ఇక అయోధ్య ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకోబోతున్నదని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. అనంతరం ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​ మాట్లాడుతూ.. రామమందిరం […]

Read More
జై శ్రీరారం నినాదం విశ్వవ్యాప్తం

‘జైశ్రీరామ్​’ నినాదం విశ్వవ్యాప్తమైంది

అయోధ్య: భారతీయ జాతీయభావాలకు, సంస్కృతికి అయోధ్య రామాలయం ఓ ప్రతీక అని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అయోధ్య పోరాటం భవిష్యత్​ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. బుధవారం ఆయన అయోధ్యలో రామాలయానికి భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ జైశ్రీరామ్ అనే నినాదం అయోధ్యలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని మోదీ అన్నారు. ‘ప్రతి గుండె ఉప్పొంగుతోంది. ఇది యావద్దేశం భావోద్వేగంతో పులకిస్తున్న వేళ. సుదీర్ఘ నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. రామ్‌ లల్లా కోసం […]

Read More
కార్పొరేట్​ ఆగ్రహాలపై హైకోర్టు సీరియస్​

‘కార్పొరేట్​’ ఆగడాలపై హైకోర్టు ఆగ్రహం

సారథి న్యూస్​, హైదరాబాద్​: కార్పొరేట్​ ఆస్పత్రుల ఆగడాలపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల నుంచి అధికచార్జీలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అపోలో, బసవతారకం కేన్సర్​ ఆస్పతులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని ఓ ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి […]

Read More
అయోధ్యపురిలో అద్భుత ఘట్టం

అయోధ్యపురిలో అద్భుత ఘట్టం

అయోధ్య: అయోధ్యపురిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్​ భారతదేశం వేయికండ్లతో వేచిచూసిన దృశ్యం కనువిందు చేసింది. దశాబ్దాల పోరాటం ఫలించింది. 130 కోట్ల భారతీయుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలిఅడుగు పడింది. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజచేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పూజకు ముందు ప్రధాని మోదీ హనుమాన్‌గర్హిలో పూజలు నిర్వహించారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని పూజలు […]

Read More
అయోద్యకు చేరుకున్న మోదీ

అయోధ్యకు చేరుకున్న మోదీ

అయోధ్య: ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో అయోధ్యకు విచ్చేసిన ప్రధానికి ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​, పలువురు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అయోధ్యలోని హనుమాన్​గడికి చేరుకొని ప్రత్యేకపూజలు చేశారు. రామ్​లాలాలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం 12.44 నిమిషాలకు ప్రధాని రామజన్మభూమిలో రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.

Read More
కరోనాను బాగా కట్టడిచేశాం

కరోనాను బాగా కట్టడిచేశాం

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారిని యూఎస్‌ బాగా కట్టడి చేసిందని, ఇండియా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘మనం చాలా బాగా చేస్తున్నామని అనుకుంటున్నాను. ఏ దేశం చేయని విధంగా మనం పనిచేశామని అనుకుంటున్నాను. మీరు పరిశీలిస్తే ఇప్పుడు ఏ దేశాల గురించి మాట్లాడుకుంటున్నారో తెలుస్తోంది. మనది చైనా, ఇండియా మినహా మిగతా దేశాల కంటే పెద్ద దేశం. చైనా ప్రస్తుతం భారీ మంటలను ఎదుర్కొంటోంది. ఇండియా విపరీతమైన సమస్యను ఎదుర్కొంటోంది. భారతదేశానికి […]

Read More