సామాజికసారథి, నాగర్ కర్నూల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమీకృత గురుకులానికి తొలి అడుగుపడింది. నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్లు, కాలేజీల్లో చదవలేని పేద విద్యార్థులు ఇక్కడే నాణ్యమైన ఉన్నతవిద్య వరకు అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22 సమీకృత గురుకులాలకు ఈ నెల11న శంకుస్థాపన చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలలను ఒకే క్యాంపస్ లో నిర్వహించడం.. అన్ని […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు మున్సిపాలిటీ అవినీతి కంపు రాజ్యమేలుతోంది. కంచె చేను మేసిందన్న చందంగా మున్సిపాలిటీకి జవాబుదారీగా ఉండాల్సిన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది కొందరు స్టాఫ్ తో కుమ్మక్కై అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మున్సిపాలిటీలో తన మాటవినని కిందిస్థాయి సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీచేయడం పరిపాటిగా మారింది. మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి పని జరిగినా కమిషనర్ తనవంతు పర్సెంటేజీ తనకు వచ్చేలా చూసుకుంటున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా నాగర్ కర్నూల్ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ గా వచ్చి ఫొటోలు దిగుతుండటం పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అలాంటి వ్యక్తితో పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని పిలవకుండా వారే వచ్చి ఫొటోలు దిగుతున్నారని తేల్చిచెప్పారని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముక్తార్ అన్నారు. మంగళవారం […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కేసీఆర్ పరిపాలన కాలంలో రాజకీయంగా పడిన ఇబ్బందులను ఇప్పటికీ నాటి విపక్షమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటుంటారు. కేసులు, ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులు గురిచేసేవారని చెబుతుంటారు. అధికారమార్పిడి జరగడంతో కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ హయాంలో రాజకీయంగా జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరిస్తూ ఈనెల […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ షురూ చేశారు. అడ్డగోలు వ్యవహారాలతో ‘ఛీ’ అనిపించుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలను ముఖ్యంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులను తీవ్రంగా వేధించారు. ఎన్నో ఏండ్ల తర్వాత నాగర్ కర్నూల్ నియేజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా డాక్టర్ రాజేశ్ రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల సుదీర్ఘనిరీక్షణ ఫలించింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులుగా […]
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్మీ మాజీ జవాన్ ను స్థానికులు చెప్పులతో చితకబాదారు. పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు అతడి ఇంటి ముందు ఆ గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. స్థానికుల కథనం.. పాలెం గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ జవాన్ దుగ్యాల వెంకటయ్య.. ఓ మాజీ ప్రజాప్రతినిధి […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో బుల్డోజర్ రాజకీయం నడుస్తోందని నాగర్ కర్నూల్ మాజీఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలుచేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని మండిపడ్డారు. మూసీ ఉన్న శ్రద్ధ రైతుబంధుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రూ.60వేల పెడుతున్న దాంట్లో రూ.2వేల కోట్లు రైతుభరోసాకు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు […]