సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పాస్ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఆనందగిరిపై ఇటీవల కొత్తగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవంలో గురువారం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయనను ఆలయకమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు, అభిమానులు వెంకట్రామిరెడ్డి, తిరుపతయ్య, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సామాజికసారథి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు, యువనేత, తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసొసియేషన్ చైర్మన్ డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి 49వ జన్మదిన వేడుకలను గురువారం యువకులు పెద్దఎత్తున జరుపుకున్నారు. కేక్‌కట్‌చేసి పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కరుణాకర్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.శేఖర్, మాజీ అధ్యక్షుడు సుభాష్, మాజీ ఎంపీపీ శాంతనరసింహ, ఉపసర్పంచ్లు ఎండీ రఫీ, సి.తిరుపతయ్య, గౌరి తిరుపతయ్య, బండి చెన్నయ్య, వార్డుసభ్యులు, నాయకులు, కార్యకర్తలు […]
సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ మంగళవారం వెల్దండ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఎస్సై నర్సింహులును అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటి సత్వర పరిష్కారం చూసి ప్రశంసించారు. రికార్డులను పరిశీలించి భేష్ అని కితాబు ఇచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటుకు చూపిన ప్రత్యేక చొరవను చూసి ఎస్సైని ప్రత్యేకంగా అభినందించారు. గార్డెనింగ్, స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో […]
అక్రమార్కులకు ఖాకీ దన్ను పాలెంలో నకిలీ ప్లాట్ల అమ్మకంలోనూ సహకారం హైదరాబాద్‌లో ఉండి చక్రం తిప్పుతున్న అధికారి కబ్జాదారులు.. కాలనీవాసులపై దాడి ఎఫ్ఐఆర్ కాకుండా రంగంలోకి స్థానిక పోలీసులకు వార్నింగ్ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలో తోటపల్లి సుబ్బయ్య కాలం నాటి రూ.కోటి విలువైన పార్కు స్థలం ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ‘పార్కుస్థలం కబ్జా’ అనే శీర్షికన ‘సామాజికసారథి’ సోమవారం అక్రమార్కుల బాగోతాన్ని బయటపెట్టింది. ఈ కథనంపై మండల […]
జేఈఈ మెయిన్, అడ్వాన్స్, నీట్ అభ్యర్థులకు నిపుణుల సూచనలు పరీక్షల్లో సమయ సద్వినియోగమే కీలకం ప్రణాళికతో కూడిన సంసిద్ధత అవసరం చిన్నజాగ్రత్తలతో ఒత్తిడిని జయించండి పాజిటివ్ఆలోచనలతో సత్ఫలితాలు :: కె.నరహరిగౌడ్, సామాజిక సారథి, ప్రత్యేక ప్రతినిధి ఇంటర్మీడియట్.. విద్యార్థుల జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడే తమ బిడ్డ జాగ్రత్తగా అడుగు వేయాలనీ, సురక్షితంగా ఒడ్డుకు చేరాలని ఏ తల్లితండ్రులైనా కోరుకుంటారు. డాక్టర్, ఇంజనీర్కావాలనుకునే వారి కలలు సాకారం చేరుకోవాలన్నా ఈ చౌరస్తా దాటాల్సిందే. ఐఐటీ, ఎన్ఐటీ, తదితర […]
సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో శనివారం ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు రాథోడ్ (25) ప్రమాదస్థలంలోనే మృతిచెందారు. స్థానికుల కథనం.. శనివారం మధ్యాహ్నం రెండో షిఫ్ట్ లో బ్లాస్టింగ్ అనంతరం వాహనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్రేడర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రాంతం కాని ప్రాంతం […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన గురుకులం, మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి చదివేందుకు గత మే 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సంబంధిత స్కూలులో జాయిన్ కావాలని గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు ప్రకటించారు. సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో పొందుపరిచారు. వెబ్సైట్ లోకి […]