సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తన కుమారుడిని అకారణంగా దుర్భాషలాడి దూషించిన బిజినేపల్లి ఎస్సై కృష్ణఓబుల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని నాగర్ కర్నూ్ల్ జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి శుక్రవారం ఎస్పీ పి.మనోహర్ కు ఫిర్యాదుచేశారు. 20వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తన కుమారుడు గణేశ్ కోళ్ల దాణా వెహికిల్ ను తీసుకొస్తుండగా ఎస్సై ఓబుల్ రెడ్డి ఆపి తన పేరు చెప్పినా కూడా చెంపదెబ్బ కొట్టడమే కాకుండా స్టేషన్ కు తీసుకెళ్లి రాయలేని […]
సామాజికసారథి, బిజినేపల్లి: ఓ తండ్రి పంతం, పట్టింపు నైజం.. పోలీసుల పట్టించుకోని తనం.. వెరసి ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసింది. ఆపరేషన్ పత్రాలపై సకాలంలో సంతకం చేయకపోవడంతో ఆ బిడ్డ కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం వెలుగుచూసింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన మహేశ్వరి, రేవెల్లి గ్రామానికి చెందిన టపా మహేష్ కు మూడేళ్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారికి ఇప్పుడు […]
చర్లగూడం ప్రాజెక్టు కారణంగా 50 మంది రైతులు మృత్యువాత ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులు నేడు అడ్డాకూలీలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ ధ్వజం మర్రిగూడం భూనిర్వాసిత రైతుల ధర్నాకు మద్దతు సామాజికసారథి, మునుగోడు: చర్లగూడెం భూనిర్వాసితులకు సీఎం కేసీఆర్ ఫాంహౌస్ అమ్మి అయిన సరే భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో పరిహారం కోసం స్థానికుల నాయకులను ఆశ్రయిస్తే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పెన్నులో ఇంకు […]
బిజినేపల్లి ఎస్సై కన్ఫ్యూజన్ దళితులపై అట్రాసిటీ కేసు చట్టం పరువు నవ్వులపాలు సామాజికసారథి, బిజినేపల్లి: ఆయనొక పోలీసు అధికారి.. చట్టాలను చదవనిదే అడుగు కూడా బయటపెట్టరు.. అలాంటి డ్యూటీలో ఉన్న ఆయన చట్టాన్ని ప్రయోగించడంలోనూ, ఫిర్యాదుదారులకు న్యాయం చేయడంలోనూ విఫలమయ్యారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దళితులపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నవ్వులపాలయ్యారు. బాధితుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు బోనాసి భీమయ్య కాలనీలో తన ఇంటికి అక్రమంగా కరెంట్ […]
వీఆర్ఏ కుటుంబం ఆత్మహత్యాయత్నం పురుగు మందు తాగిన భార్య నాగర్ కర్నూల్ జిల్లా పాలెంలో విషాదకర ఘటన సామాజికసారథి, బిజినేపల్లి: జీతం రాక.. చేతిలో చిల్లిగవ్వలేక.. అప్పులు తీర్చలేక ఓ వీఆర్ఏ కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన మంగళవారం బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వేపూరి రాజేశ్ పాలెం వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం ఏడాదిన్నర క్రితం […]
పేరు మార్పునకు అసెంబ్లీలో బిల్లు పాస్ సామాజిక సారథి, రామకృష్ణాపూర్: సిరుల తల్లి సింగరేణి గర్భం నుంచి ఉద్భవించిన ఊరు రామకృష్ణాపూర్ అని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్పునకు అసెంబ్లీలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బిల్లు పాస్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని టీఆర్‌ఎస్‌నాయకులు, కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి, స్వీట్లను […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని టీఆర్ఎస్ నేతలు భూబకాసురులుగా మారారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నరు. ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అరాచక పాలనకు ప్రతిఒక్కరూ సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధనార్జన్ రెడ్డిగా మర్రి పేదప్రజల ఉసురు తీస్తున్నరని విమర్శించారు. మార్కెట్ […]
ఛత్రపతి శివాజీ సేన పేరుతో ఓ యువకుడి హుకుం సామాజికసారథి, బిజినేపల్లి: ఒకరు ప్రపంచ మేధావి.. దేశానికే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించినవారు. మరొకరు పీడిత ప్రజలకు చదువులు చెప్పించి చైతన్యం నింపిన మహానుభావుడు. ఆ మహనీయులే భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరొకరు మహాత్మా జ్యోతిబాపూలే. వారిద్దరి మార్గంలో నడవని వారంటూ ఉండరు. ఆ మహనీయుల విగ్రహాలు ఉండని ఊరంటూ లేదు. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్ పల్లిలో పీడిత, బహుజనవర్గాల ప్రజలు […]