Breaking News

ఒకరిపై ఫిర్యాదు.. మరొకరిపై కేసు

ఒకరిపై ఫిర్యాదు.. మరొకరిపై కేసు

  • బిజినేపల్లి ఎస్సై కన్ఫ్యూజన్​
  • దళితులపై అట్రాసిటీ కేసు
  • చట్టం పరువు నవ్వులపాలు

సామాజికసారథి, బిజినేపల్లి: ఆయనొక పోలీసు అధికారి.. చట్టాలను చదవనిదే అడుగు కూడా బయటపెట్టరు.. అలాంటి డ్యూటీలో ఉన్న ఆయన చట్టాన్ని ప్రయోగించడంలోనూ, ఫిర్యాదుదారులకు న్యాయం చేయడంలోనూ విఫలమయ్యారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దళితులపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నవ్వులపాలయ్యారు. బాధితుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు బోనాసి భీమయ్య కాలనీలో తన ఇంటికి అక్రమంగా కరెంట్​ వాడుతున్నాడు. ఇటీవల విద్యుత్​శాఖ విజిలెన్స్​అధికారులు తనిఖీలు నిర్వహించి ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఆయన తనపై కొందరు కక్షగట్టి ట్రాన్స్​కో అధికారులు చెప్పారని, అందుకు 4వ వార్డు సభ్యుడు కుమ్మరి స్వామితో పాటు ఎంపీపీ శ్రీనివాస్​గౌడ్, అతని అనుచరులు, మరో దళిత యువకుడే కారణమని బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ అడుగు ముందుకేసిన ఎస్సై ఓబుల్​రెడ్డి మాత్రం ఫిర్యాదు ఒకరిపై ఇస్తే కేసు మరొకరు.. సంబంధం లేని వ్యక్తులపై చేశారు. ఎంపీపీ శ్రీనివాస్ ​గౌడ్​తో పాటు 5వ వార్డు సభ్యుడు. దళితుడైన శివకుమార్​పై కేసు నమోదుచేసి ఎఫ్ఆర్ఐ కూడా ఇష్యూచేశారు. దళితులకు రక్షణగా తెచ్చిన చట్టాన్ని వారిపైనే ఎలా ప్రయోగిస్తారని మండల ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. చివరికి ఇది తెలిసిన ఎస్సై ఓబుల్​రెడ్డి పొరపాటు జరిగిందని నాలుక కరుచుకున్నారు. ఎంపీపీపై కేసు నమోదుకావడంతో టీఆర్ఎస్​లోనే మరోవర్గం వారు చేయించారా? అనే చర్చ నడుస్తోంది. ఈ ఉదంతం పోలీసులకు తలనొప్పిగా మారింది. కాగా, ఎంపీపీ శ్రీనివాస్ ​గౌడ్, శివకుమార్ ఎస్సైపై కోర్టును ఆశ్రయించారు. చివరికి బోనాసి భీమయ్యతో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ నాయకులు పేర్కొనడం గమనార్హం.

ఎస్సైకి ఫిర్యాదుదారుడికి వినతిపత్రం
బిజినేపల్లి నమోదుచేసిన కేసులు( కింది భాగంలో చదువుకోవచ్చు)