బిజినేపల్లి ఎస్సై కన్ఫ్యూజన్ దళితులపై అట్రాసిటీ కేసు చట్టం పరువు నవ్వులపాలు సామాజికసారథి, బిజినేపల్లి: ఆయనొక పోలీసు అధికారి.. చట్టాలను చదవనిదే అడుగు కూడా బయటపెట్టరు.. అలాంటి డ్యూటీలో ఉన్న ఆయన చట్టాన్ని ప్రయోగించడంలోనూ, ఫిర్యాదుదారులకు న్యాయం చేయడంలోనూ విఫలమయ్యారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దళితులపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నవ్వులపాలయ్యారు. బాధితుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు బోనాసి భీమయ్య కాలనీలో తన ఇంటికి అక్రమంగా కరెంట్ […]
వీఆర్ఏ కుటుంబం ఆత్మహత్యాయత్నం పురుగు మందు తాగిన భార్య నాగర్ కర్నూల్ జిల్లా పాలెంలో విషాదకర ఘటన సామాజికసారథి, బిజినేపల్లి: జీతం రాక.. చేతిలో చిల్లిగవ్వలేక.. అప్పులు తీర్చలేక ఓ వీఆర్ఏ కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన మంగళవారం బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వేపూరి రాజేశ్ పాలెం వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం ఏడాదిన్నర క్రితం […]
పేరు మార్పునకు అసెంబ్లీలో బిల్లు పాస్ సామాజిక సారథి, రామకృష్ణాపూర్: సిరుల తల్లి సింగరేణి గర్భం నుంచి ఉద్భవించిన ఊరు రామకృష్ణాపూర్ అని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్పునకు అసెంబ్లీలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బిల్లు పాస్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని టీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి, స్వీట్లను […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని టీఆర్ఎస్ నేతలు భూబకాసురులుగా మారారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నరు. ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అరాచక పాలనకు ప్రతిఒక్కరూ సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధనార్జన్ రెడ్డిగా మర్రి పేదప్రజల ఉసురు తీస్తున్నరని విమర్శించారు. మార్కెట్ […]
ఛత్రపతి శివాజీ సేన పేరుతో ఓ యువకుడి హుకుం సామాజికసారథి, బిజినేపల్లి: ఒకరు ప్రపంచ మేధావి.. దేశానికే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించినవారు. మరొకరు పీడిత ప్రజలకు చదువులు చెప్పించి చైతన్యం నింపిన మహానుభావుడు. ఆ మహనీయులే భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరొకరు మహాత్మా జ్యోతిబాపూలే. వారిద్దరి మార్గంలో నడవని వారంటూ ఉండరు. ఆ మహనీయుల విగ్రహాలు ఉండని ఊరంటూ లేదు. ఈ క్రమంలో నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్ పల్లిలో పీడిత, బహుజనవర్గాల ప్రజలు […]
అడ్డుకున్న వట్టెం భూనిర్వాసితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చుక్కెదురైంది. వట్టెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే అదనంగా లక్ష రూపాయలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి నాలుగేళ్లు గడిచినా నేటికీ నెరవేర్చలేదని వట్టెం భూనిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని సోమవారం సాయంత్రం వట్టెం గ్రామంలో అడ్డుకున్నారు. ఆసరా పింఛన్ పంపిణీలో […]
సామాజికసారథి, ఫీచర్స్ డెస్క్: జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. వెస్ట్రన్, పాప్ మ్యూజిక్ సంగీత ప్రపంచాన్ని ముంచెత్తుతున్న తరుణంలో కమ్మనైన బాణీలతో పల్లె పదానికి కొత్త సొబగులు అద్దుతున్నారు ఈ గాయకులు. ఆ పాటలు వింటుంటే గుండెకు హత్తుకుంటుంది. ఒక్కసారిగా పల్లె స్మృతులు, బావమరదళ్ల సరసాలు, పిచ్చుకగూళ్లు, సెలయేర్లు, కొబ్బరి తోటలు.. ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. అలాంటి జ్ఞాపకాలను మోసుకొచ్చే ఓ సాంగ్ ఇప్పుడు యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది. DJSHIVA music ఛానెల్ రూపొందించిన ‘‘ […]
ఒక ఇంట్లో ఇద్దరికి.. ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ ఆసరా లబ్ధిదారుల ఎంపికలో భారీ అక్రమాలు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా లిస్టుల తయారీ ఓకే చెబుతున్న అధికారులు.. అర్హులకు అన్యాయం సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు విమర్శలకు దారితీస్తున్నది. ఏదైనా కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడితే గైడ్లైన్ ప్రకారం అధికారులు లబ్ధిదారులను ఎంపికచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా అధికారపార్టీ […]