కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు 50శాతం మంది ఇంటినుంచి పనిచేసేలా అనుమతి వీడియో కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు ప్రాధాన్యం కరోనా, ఒమిక్రాన్వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం ఖరగ్ పూర్ఐఐటీలో 60 మందికి కరోనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొవిడ్పాజిటివ్ న్యూఢిల్లీ/చండీగఢ్: దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అండర్ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు […]
సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై సర్కారు సీరియస్ ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను సస్పెండ్ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు విచారణకు ఆదేశించిన […]
శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రంహోం వెసులుబాటు కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. వీకెండ్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే కీలక నిర్ణయం తీసుకున్నది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం […]
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు వైఎస్సార్టీపీలో చేరిన గట్టు రాంచంద్రరావు సామాజికసారథి, హైదరాబాద్: ‘ఏపీలో పార్టీ పెడుతున్నారా అంటూ మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అక్కడ కూడా పార్టీ పెడతాం’ అంటూ వైఎస్షర్మిల సంచలన వాఖ్యలు చేశారు. సోమవారం వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ఆవేదన యాత్ర పేరుతో ఈ […]
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు రద్దు సామాజికసారథి, భద్రాచలం: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంపై పడింది. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు జరగాల్సిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను రద్దుచేశారు. అలాగే స్వామి వారి తిరువీధి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. దేవస్థానంలో సేవల పునరుద్ధరణ గురించి కరోనా ప్రభావం ముగిశాక ప్రకటిస్తామని […]
సూర్యాపేట మెడికల్కాలేజీలో ఘటన విచారణకు ఆదేశించిన మంత్రి హరీశ్‌రావు సామాజికసారథి, హైదరాబాద్: సూర్యాపేట మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌పై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డిని ఆదేశించామన్నారు. ఈ ఘటనకు కారకులను వదిలిపెట్టేది లేదని, ర్యాగింగ్ అనేది నిషేధమని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్ధులు […]
16వరకు విద్యాసంస్థలకు సెలవులు కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు హాలీ డేస్ఇవ్వాలని సూచించారు. కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యాగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. […]
బంపర్ డ్రాల పేరుతో గుంపులు గుంపులుగా జనం ప్రతిపక్షాలను కట్టడికేనా? అధికారపార్టీ నేతలను పట్టించుకోరా? పోలీసుల తీరుపై విమర్శలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: కొవిడ్‌నిబంధనలు కొందరికేనా?.. అధికారపార్టీ నేతలకు ఒకన్యాయం.. విపక్ష పార్టీలకు మరో న్యాయమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల అధికారపార్టీలు నేతలు చేపట్టిన ధర్నాలే ఇందుకు నిదర్శమని పేర్కొంటున్నారు. నాగర్ కర్నూల్‌జిల్లాలో కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని ఇటీవల బీజేపీ నాయకులు చేపట్టిన జనజాగరణ యాత్రకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కానీ […]