Breaking News

ఏపీలోనూ కొత్త పార్టీ

ఏపీలోనూ కొత్త పార్టీ
  • వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు
  • వైఎస్సార్​టీపీలో చేరిన  గట్టు రాంచంద్రరావు

సామాజికసారథి, హైదరాబాద్‌: ‘ఏపీలో పార్టీ పెడుతున్నారా అంటూ మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టకూడదని రూల్‌ ఏం లేదు కదా? అక్కడ కూడా పార్టీ పెడతాం’ అంటూ వైఎస్​షర్మిల సంచలన వాఖ్యలు చేశారు. సోమవారం వైఎస్సార్​టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ఆవేదన యాత్ర పేరుతో ఈ నెల 19 లేదా 20 నుంచి మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. నిబంధనల ప్రకారం తాము వెళ్తామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. మరోవైపు.. రైతుబంధు, పండుగలకు ఈ నిబంధనలు ఏ మాత్రం అడ్డురావు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు. కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు అడ్డువస్తున్నాయని ఆమె ఆరోపించారు. కాగా, టీఆర్ఎస్​నాయకుడు గట్టు రాంచంద్రారావు ఆ పార్టీని వీడి వైఎస్సార్​టీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ.. దేశానికి నాయకత్వం చేయొచ్చు కానీ తెలంగాణలో పుట్టిన షర్మిలక్క రాష్ట్రానికి నాయకత్వం చేయకూడదా? ప్రజ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న ఉంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకోవ‌చ్చు’ అని అన్నారు.