సామాజికసారథి, సిద్దిపేట: గతనెల 17న సెలవుపై వచ్చి కనిపించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డిపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ లోని ఫరిద్ కోట్ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 17న అక్కడి నుంచి సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి […]
గడపగడపకు బీఎస్పీ కార్యక్రమం నాలుగు రోజుల పాటు ఇక్కడే నేడు శిరసనగండ్ల నుంచి షురూ ఏర్పాట్లు పూర్తిచేసిన పార్టీ శ్రేణులు సామాజికసారథి, చారకొండ: రాష్ట్రంలో బహుజన సమాజ్పార్టీ మరింత దూకుడు పెంచింది. బహుజనుల రాజ్యాధికార సాధన దిశగా బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్కుమార్అడుగులు వేస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు వారితో మమేకమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి గ్రామానికి వెళ్తున్నారు. అందులో భాగంగానే నాగర్కర్నూల్జిల్లాలో ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు […]
ఖాళీలు 41,177 పోస్టులు మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: డిసెంబర్ 1 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 41,177 స్థానాలు లేదా మొత్తం మంజూరైన పోస్టుల్లో ఐదుశాతం ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా..? అని లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. డిసెంబర్ 1వ […]
ఏపీ ఉద్యోగులకు శుభవార్త పీఆర్‌సీపై కీలక ప్రకటన 11 అంశాలతో సీఎం జగన్‌కు నివేదిక వెల్లడించిన సీఎస్ సమీర్ శర్మ అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. ఉద్యోగులకు 27శాతం మాత్రమే ఫిట్ మెంట్ ఇవ్వాలని.. కార్యదర్శుల కమిటీ నివేదిక ఇచ్చిందని ఈ సందర్భంగా వివరించారు. ఫిట్ మెంట్ పై ఉద్యోగులకు ఎవరూ కూడా ఆందోళన […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అడిషనల్కలెక్టర్ మనుచౌదరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం, సీఐటీయూల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల్లో కార్మికులకు గత మూడు నెలల నుంచి బిల్లులు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. మరొకవైపు కరోనా కారణంగా పాఠశాలల మూతపడి […]
ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు ముష్కరులు ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దాడికి తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. శ్రీనగర్ శివారులో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పంతాచౌక్ ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ […]
నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం స్వచ్ఛతపై ప్రత్యేకశ్రద్ధ ఆటోలను ప్రారంభించిన కేటీఆర్ సామాజిక సారథి, హైదరాబాద్: హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చడానికి అందరూ కృషిచేయాలని, హైదరాబాద్ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్ గ్రౌండ్‌లో మంత్రి తలసానితో కలిసి సోమవారం స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఐదారేళ్లుగా […]