సామాజిక సారథి, బిజినేపల్లి: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 54వ పుట్టినరోజున 357మంది రక్తదానం చేసినట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం సర్వీంగ్ హాండ్స్ పాలమూరు రక్తనిధి తలసేమియా అండ్ సికిల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి కుమార్, చింతల విజయ్ ముదిరాజ్, బోనాసి రాంచందర్, జిల్లా నాయకులు అంతటి […]
సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రైస్ మిల్లర్లను కోరారు. మండల కేంద్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం వడ్ల నిల్వలు పెరిగిపోవడంతో పాటు రాష్ట్రంలో తుఫాన్ ఉందని వాతావరణ శాఖ చేబుతుందన్నారు. ఆకాల వర్షాలు రాకముందే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మిలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పార్టీ మండల […]
సామాజిక సారథి, తిమ్మాజిపేట: మద్యం డిపోలో హమాలీలుగా పని చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని నిరుద్యోగ యువకులు మంగళవారం డిపో ఇన్ చార్జి డీఎం వినతిపత్రం అందజేశారు. తిమ్మాజీపేటకు చెందిన పలువురు నిరుద్యోగులు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి 100వరకు ర్యాలీగా బయలుదేరారు. స్పందించిన డిఎం నిరుద్యోగుల వినతిని ఉన్నతాధికారులకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళుతాని చెప్పారు.
సామాజిక సారథి, నార్కెట్ పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతిచెందాడు. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయక విగ్రహం ప్రక్కనున్న భక్తుల విశ్రాంతి షెడ్డు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై దేవస్థానం సూపరింటెండెంట్ గుజ్జుల తిరుపతిరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.యాదయ్య పేర్కొన్నారు.
సామాజిక సారథి, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని షోలాపూర్ లోని హరిహరేశ్వర్ ఆలయంలో తవ్వకాల్లో ప్రత్యేకమైన శివలింగం లభ్యమైంది. ఈ లింగం అత్యంత అరుదైన బహుముఖ శివలింగం కనుగొనబడింది. పాణమట్టంమీద ఇతర దేవతలతో పాటు 359 శివుని ముఖాలను కలిగి ఉంది. దాని బరువు 4000కిలోలు ఉండడంతో భక్తులు తండోపతండాలు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ, స్వయంభూవుడిని దర్శించుకుంటున్నారు.
సామాజిక సారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామ సర్పంచ్ దార్ల కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విలువైన ఆట వస్తువులు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ కల్వకుర్తి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు కు అందజేశారు. ఆయన వెంట మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి వెళ్లి స్వయంగా నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. మరో అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఆయన వెంట […]
సామాజిక సారథి డిండి: గత పదిరోజులగా కురుస్తున్న అకాల వర్షాలకు చేతికొచ్చిన వరి పంటలు తడిచిపోయి పంట పొలంలోనే మొలకెత్తాయి. వివరాల్లోకి వెళితే డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామానికి చెందిన తోటపల్లి మల్లేష్ అను యువకుడు బీఎడ్ పూర్తి చేసిండు. ఉన్నత చదువులు చదివిన ఏలాంటి ఉద్యోగం రాకపోవడంతో తనకున్న మూడెకరాల వ్యవసాయ పొలంలో వరిసాగు చేశాడన్నారు. దీంతో చేతికొచ్చిన పంట పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆ యువరైతతు కన్నీటి పర్యంతమయ్యాడు. సమీపంలోని 100 ఎకరాల్లో […]