Breaking News

Day: August 12, 2021

యువతకు వివేకానందుడే ఆదర్శం

యువతకు వివేకానందుడే ఆదర్శం

సామాజిక సారథి, చొప్పదండి: నేటి యువతకు వివేకానందుడు ఆదర్శప్రాయుడని కరీంనగర్​జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, నెహ్రూ యువకేంద్ర జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ రాంబాబు కొనియాడారు. నెహ్రూ యువకేంద్ర, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా చొప్పదండిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. […]

Read More
జీవాలకు నట్టల మందులు పంపిణీ

జీవాలకు నట్టల మందులు అందజేత

సామాజిక సారథి, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కురుమ సంఘం అధ్యక్షుడు ఏముండ్ల రాయుడు, బీరయ్య కాపరులకు అందజేశారు. కార్యక్రమంలో కేవైసీఎస్ ​రాష్ట్ర కార్యదర్శి పెద్ది వీరేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, కురుమ సంఘం నాయకులు ఏముండ్ల రాజయ్య, ఓరుగుల తిరుపతి, రవి, కొమురెల్లి, నాగరాజు, వెంకటయ్య పాల్గొన్నారు.

Read More
‘ఉపాధి’ బిల్లులు వెంటనే చెల్లించాలి

‘ఉపాధి’ బిల్లులు వెంటనే చెల్లించాలి

సామాజిక సారథి, అచ్చంపేట: ఉపాధి హామీ పనులకు సంబంధించిన పెండింగ్ ​బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ ​చేస్తూ గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కులాల వారీగా వేతనాలు ఇస్తున్నారని, నాలుగు నెలలైనా కొందరికి కూలి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఉపాధి హామీ చట్టంలో రెండు వారాలకు ఒకసారి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తుంగలో […]

Read More
విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

సారథి, రామడుగు: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్​ కీలక భూమిక పోషించిందని జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ​గుర్తుచేశారు. గురువారం ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చదువు, పోరాడు అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు. భగత్ సింగ్ లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకొని శాస్త్రీయ విద్యావిధానం, కామన్ స్కూలు విధానం కోసం పోరాటం […]

Read More
‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’

‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’

సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, వీహెచ్​పీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, పేదలకు డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు కట్టిస్తామని చేసిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మరోసారి […]

Read More
రాజన్నకు టీఎస్​పీఎస్సీ సభ్యుడి పూజలు

రాజన్నకు టీఎస్​పీఎస్సీ సభ్యుడి పూజలు

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్​పీఎస్సీ) సభ్యుడు కారం రవీందర్​రెడ్డి, కరీంనగర్ టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్​ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో సాదరంగా ఆహ్వానం పలికి వేదోక్తంగా ఆశీర్వచనాలు అందించారు. పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు శాలువాతో సత్కారించి సన్మానించారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో ప్రెసిడెంట్ తో పాటు ఏఈవో […]

Read More
వకుడి దారుణహత్య

యువకుడి దారుణహత్య

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని వనపర్తి జిల్లా సఫాయిగూడెం గ్రామానికి చెందిన శివ(20)గా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ ​తెలిపారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనతో సఫాయిగూడెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు దారి తీయడం వెనుక ప్రేమ వ్యవహారమా? […]

Read More