Breaking News

యువకుడి దారుణహత్య

వకుడి దారుణహత్య

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని వనపర్తి జిల్లా సఫాయిగూడెం గ్రామానికి చెందిన శివ(20)గా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ ​తెలిపారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనతో సఫాయిగూడెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు దారి తీయడం వెనుక ప్రేమ వ్యవహారమా? లేక ఇతర ఏదైనా కారణమా? అనే విషయాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఎక్కడైనా చంపి ఇక్కడ మృతదేహాన్ని పడేశారా? లేక ఇక్కడికే తీసుకొచ్చి చంపేశారా? అనే కోణంలో బిజినేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.