Breaking News

Month: July 2021

దళితులపై బీజేపీ చిన్నచూపు

‘దళితులపై బీజేపీ చిన్నచూపు’

సారథి,పెద్దశంకరంపేట: దళితులను బీజేపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ దళిత సర్పంచ్ మహేశ్వరి నరేష్​ను ఎమ్మెల్యే రఘునందన్ రావు అవమానించడం, దళితుల పట్ల ఆయనకు ఉన్న చిన్నచూపు, బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఎంపీపీ, సర్పంచ్​కు చెప్పకుండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Read More
ఉరకలేస్తున్న కృష్ణమ్మ

ఉరకలేస్తున్న కృష్ణమ్మ

గంట గంటకు పోటెత్తుతున్న వరద 4.75 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల జూరాల 45 గేట్ల ఎత్తివేత సారథి, జూరాల(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానదికి వరద ప్రవాహం గంట గంటకు ఉధృతంగా పెరుగుతోంది. దిగువన శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. జూరాల ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే బీచుపల్లి వద్ద పుష్కరఘాట్లను ముంచెత్తింది. ఎగువ నుంచి నీటి విడుదల పెరిగితే ఆలయాన్ని వరద తాకనుంది. ఈ […]

Read More
కులాలుగా విభజించి పనులు చేయడం సరికాదు

కులాలుగా విభజించి పనులు చేయడం సరికాదు

సారథి, బిజినేపల్లి: ఉపాధిహామీ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలను కులాల వారీగా విభజించి పనులు చేయించడం సరికాదని, సంబంధిత జీవోను వెంటనే రద్దుచేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్)​జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పనుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​నిధులను ఖర్చుచేయడం సరికాదన్నారు. గురువారం బిజినేపల్లి తహసీల్దార్​ ఆఫీసు ఎదుట కేవీపీఎస్ ​ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2005లో నాటి ప్రభుత్వం కులాలు, మతాలకతీతంగా […]

Read More
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ పి.శ్రీనివాస్​గౌడ్​ గురువారం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉజ్వల భవిష్యత్​ను ఏర్పాటుచేసుకుని తద్వారా భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శారదమ్మ, సర్పంచ్​ఎస్.మహేశ్​రావు, ఎస్ఎంసీ చైర్మన్​బి.యాదయ్య, ఉపాధ్యాయులు భాస్కర్​రెడ్డి, జహంగీర్, నాగేశ్వర్ రావు, సుధారాణి పాల్గొన్నారు.

Read More
రాజన్నసన్నిధిలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌

రాజన్నసన్నిధిలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఏకైక కైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి లడ్డూప్రసాదం అందజేసి సత్కరించారు.

Read More
కండరగండడు

కండరగండడు

సారథి, మానవపాడు: 50 కాదు.. 100 కాదు.. 150 కేజీలకు పైగా ఉన్న బరువును ఈజీగా ఎత్తేశాడు ఈ కండరగండడు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇమ్రాన్​ మాసుం బాషా గుండ్లను ఎత్తే ప్రదర్శనలో ఎప్పటినుంచో పాల్గొంటున్నాడు. ఇటీవల బక్రీద్​పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా గుత్తి పెట్రోల్​బంక్​వద్ద సీఐటీయూ ఆటోడ్రైవర్ల యూనియన్​ఆధ్వర్యంలో గుండ్లను ఎత్తే పోటీలో పాల్గొన్నాడు. 140, 160 కిలోల బరువైన గుండ్లను ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆటోడ్రైవర్లు మాసుం బాషాకు అభినందనలు తెలిపి సన్మానించారు. […]

Read More
పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

సారథి, పెద్దశంకరంపేట: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని నారాయణఖేడ్​ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆయన మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 161 రేషన్​కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు ఆకలి బాధ ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో నూతనంగా రేషన్​ కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాంతంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో […]

Read More
ఆ రాశివారికి ఉద్యోగాల్లో ఉన్నతస్థితి అందుతుంది..

ఆ రాశివారికి ఉద్యోగాల్లో ఉన్నతస్థితి అందుతుంది..

నేటి రాశిఫలాలుతేదీ: 28.07.2021బుధవారం1.మేషంకొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు సవాల్​గా మారే సూచనలు ఉన్నాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. అనుకోని ఖర్చులు ఇతరాత్ర సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యులతో […]

Read More