Breaking News

ఆ రాశివారికి ఉద్యోగాల్లో ఉన్నతస్థితి అందుతుంది..

ఆ రాశివారికి ఉద్యోగాల్లో ఉన్నతస్థితి అందుతుంది..

నేటి రాశిఫలాలు
తేదీ: 28.07.2021
బుధవారం
1.మేషం

కొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు సవాల్​గా మారే సూచనలు ఉన్నాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. అనుకోని ఖర్చులు ఇతరాత్ర సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

2.వృషభం
ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు, ఖర్చులు అధికమవడం వల్ల ఆందోళనకు గురవుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాస ఎదుర్కొంటారు. గొంతు సంబంధిత రుగ్మతలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో వైరం నెలకొంటుంది.

3.మిథునం
కొన్ని పనులను అర్ధాంతరంగా వాయిదా వేస్తారు. బంధువుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. వేళతప్పి ఆహారం తినడం ద్వారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. వెన్నెముక సంబంధిత రుగ్మతలు వస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. షేర్ల విక్రయాల్లో తొందరవద్దు. మానసిక ఆందోళన ఉంటుంది. నిరుద్యోగులకు దూరప్రాంతాల నుంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. వైద్యరంగంలో ఉన్నవారికి చికాకులు కలుగుతాయి.

4.కర్కాటకం
రెండుమూడు విధాలుగా ధనలాభం ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కళాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. అతిగా సంభాషించడం అనర్థదాకయమని గమనించగలరు. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం వల్ల స్వల్ప అవాంతరాలు తలెత్తుతాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి అందుతుంది.

5.సింహం
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఎదుటివారిని బాగా గౌరవిస్తారు. బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. కొన్ని సమస్యలు మబ్బు వీడినట్లుగా వీడిపోతాయి. షేర్ల విక్రయాలు లాభం కలుగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

6.కన్య
పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఊహించని కాంట్రాక్టులు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. భాగస్వామ్యుల మధ్య అవగాన లోపిస్తుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. పత్రికా సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు.

7.తుల
జీవిత భాగస్వామితో వివాదాలు తీరుతాయి. పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడుతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కనిపిస్తుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకుంటారు. రాజకీయాల్లో వారికి ఆందోళన అధికమవుతాయి. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేస్తారు.

8.వృశ్చికం
బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. మీ వాహనాన్ని ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధువుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ప్రయాణాలు సజావుగా సాగుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మొండిబాకీలు వసూలవుతాయి. కొన్ని వ్యవహారాలు ప్రోత్సాహకంగా ఉంటాయి.

9.ధనుస్సు
ఆరోగ్య సమస్యలు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. కుటుంబపరంగా చికాకులు తప్పవు. భాగస్వాములతో అభిప్రాయభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కళాకారులు సమస్యలు వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆపరేషన్లు చేసేటప్పుడు డాక్టర్లు మెళకువ పాటించాలి. స్త్రీలకు వారి అనారోగ్యం కలవరపరుస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. పెండిగ్ వ్యవహారాల్లో కూడా పురోభివృద్ధి పొందుతారు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు కలిసిరావు. కుటుంబసభ్యులతో తగాదాలు ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులను ఎదుర్కొంటాయి.

10.మకరం
కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చేపడతారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దైవదర్శనానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు, పురుషులు, రాజకీయ నాయకులు, నకిలీ డాక్టర్లు పనివారలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్రుల నుంచి ధన, మాట సహాయం కోరుతారు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

11.కుంభం
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా మీకు ఎదురుండదు.పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రేమికులకు పెద్దల వైఖరి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కీలక నిర్ణయాలకు తగిన సమయం ఇదే. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. నిన్నటి సంఘటనలు గుర్తుకొస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత విముక్తి లభిస్తుంది.

12.మీనం
షేర్ల విక్రయాలు లాభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభాలు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి మోహమాటం ఎదురయ్యే అవకాశం ఉంది. ఓర్పుతోనే మీ పనులు సానుకూలమవుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక పర్యటనలు ఉంటాయి. వ్యాపార లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులకు విలువైన కానుకలు అందించి వారికి మరింత చేరువఅవుతారు. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు టీవీ, చానెల్స్ కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు.

:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్ నం.95020 59649

(మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన మాలాంటి గురూజీలను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రెమిడీలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.)