సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం రాజాపురంలో 8మంది యువకులు గ్రామంలో చీకటిపడగానే మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ, వాహనదారులు, బాటసారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘మేము దండుపాలెం బ్యాచ్ రా.. శవాలను లేపుతాం […]
సారథి, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందిగామ, నస్కల్, నిజాంపేట గ్రామాల పంచాయతీ సిబ్బంది, సఫాయి కార్మికుల వేతనాలు పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రామయంపేట ఉమ్మడి మండలం సీఐటీయూ నాయకులు సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందని కానీ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం సరికాదన్నారు. మినిమం బేసిక్ పే […]
సారథి, చొప్పదండి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని శనివారం పేదలకు సాయం చేశారు. చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కాట్నపల్లి గ్రామంలో కరోనాతో మృతిచెందిన గన్ను నారాయణరెడ్డి కుటుంబానికి రూ.ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కట్టెకోల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు గన్ను సంతోష్ రెడ్డి, కోలపురి శ్రీకాంత్, […]
సారథి, కొల్లాపూర్(కోడేరు): కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతవాసులకు వైద్యసేవలు అందించేందుకు అమెరికన్ తెలంగాణ సొసైటీ(ఏటీఎస్), తెలంగాణ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) వేగంగా ముందుకు తీసుకుపోతున్నాయి. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు నారాయణపేట జిల్లా మాగనూర్ లో తొలి దవాఖానను గతనెల ప్రారంభించారు. కొనసాగింపుగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ లో కొవిడ్ హాస్పిటల్ ను ఎస్పీ పి.సాయిశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ.కన్సల్ట్ ద్వారా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: ఏఐసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ సంయుక్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక సివిల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్ఫూర్తితో తాము కూడాజగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యెన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి పొన్నం లావణ్య తెలిపారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలో పలువురికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, లావణ్య మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు ఎల్ఎం […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. శుక్రవారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. గ్రామ, మండలస్థాయిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరారు. నీడనిచ్చే మొక్కలు, పూలమొక్కలు, ఔషధం(హెర్బల్) మొక్కలను పెంచి వచ్చే హరితహారంలో నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైకుంఠధామం పనులను పూర్తయ్యేలా […]
సారథి, వేములవాడ: ప్రతి సంవత్సరం మృర్గశిర కార్తెలో బోనాల పండగ జరుపుకోవడంతో పాటు పెద్దమ్మ, దుర్గమ్మ దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే శుక్రవారం బోనాల పండగను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవార్ల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ కులస్తుల బోనాల వేడుక సందర్భంగా అమ్మవార్లను ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు.