Breaking News

Day: June 28, 2021

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారథి, పెద్దశంకరంపేట: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జొన్నలు క్వింటాలుకు రూ.2,620 చెల్లిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తోందన్నారు. దేశంలోనే […]

Read More
వంత్​నియామకంతో కాంగ్రెస్ సంబురాలు

రేవంత్​ నియామకంతో కాంగ్రెస్ సంబురాలు

సారథి, పెద్దశంకరంపేట: పీసీసీ అధ్యక్షుడిగా ఏ.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ​అధిష్టానం నియమించడంతో ఆదివారం మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక గాంధీచౌరస్తా వద్ద టపాసులు కాల్చి ఉత్సవాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజేందర్ గౌడ్, మధుసూదన్, ఎంపీటీసీ రాజు, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు జనార్ధన్, మధు, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, హరికిషన్, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

హరిత తెలంగాణ నిర్మిద్దాం

సారథి, చొప్పదండి: పట్టణ ప్రగతిలో భాగంగా చొప్పదండి పట్టణంలోని ఆరో వార్డు వడ్లూరి గంగరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రధానంగా నీటి సమస్య, కరెంటు, డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయకపోవడంతో అధ్వానంగా ఉందన్నారు. వీటి మీద వెంటనే చేపట్టాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆరో వార్డు కౌన్సిలర్ వడ్లురి గంగరాజు మాట్లాడుతూ.. సీఎం కేఆర్ఆర్ ఆదేశాలనుసారం పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పెంచాలని, […]

Read More
బ్రహ్మకమలాల కనువిందు

బ్రహ్మకమలాల కనువిందు

సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా రామాయంపేటలో ఆదివారం సాయంత్రం 8బ్రహ్మకమలాలు వికసించాయి. ఈ పూలను దర్శించిన వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మెదక్ జిల్లా రామాయంపేట 9వ వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజుకు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఈ కమలాలు వికసించి కనువిందు చేశాయి. బ్రహ్మకమలం శివుడికి అత్యంత ప్రీతికరమైంది. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తుంటారు. అందులో భాగంగా రామాయంపేటకు చెందిన […]

Read More
పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం

సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్​జిల్లా చొప్పదండి పట్టణంలోని 8వ వార్డ్ కౌన్సిలర్​రాజన్నల ప్రణీత ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్డు సమస్యలు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. పట్టణ అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ రవి, వార్డు స్పెషలాఫీసర్ పవన్ పి.మహేష్, బిల్ కలెక్టర్లు ప్రభాకర్, ఆర్పీ సౌందర్య, ఆశా కార్యకర్త […]

Read More
పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని పెంటోనిచెరువు తూము నుంచి రైతులకు చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టులో పంటలు సాగుచేసేందుకు వీలుగా సర్పంచ్ గోవింద్ లావణ్య నాగరాజు, ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ సోమవారం నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో చెరువులను నీటితో నింపిన ఘనత టీఆర్ఎస్​ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు పంటలు పండించడానికి వీలుగా నీటి వసతి కల్పించిన నాగర్ […]

Read More
రాజన్న సన్నిధిలో మాధవానందస్వామి

రాజన్న సన్నిధిలో మాధవానందస్వామి

సారథి, వేములవాడ: దక్షిణకాశీ క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తొగుట పీఠం శ్రీశ్రీశ్రీ మాధవానందస్వామి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి పూజల అనంతరం కల్యాణమండపంలో పాదపూజ చేశారు. వారి వెంట బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, అర్చకస్వాములు పాల్గొన్నారు. అలాగే ఒకేరోజు సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయానికి రూ.20లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

Read More
టీజీవో నాగర్​కర్నూల్​జిల్లా కమిటీ ఎన్నిక

టీజీవో నాగర్​కర్నూల్ ​జిల్లా కమిటీ ఎన్నిక

సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: రాష్ట్రకమిటీ పిలుపు మేరకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అన్ని జిల్లాల కార్యవర్గాలను ఎన్నుకుంటామని ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లా టీజీవో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి(ఆర్టీవో) స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పి.రాజశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శిగా భగవేణి నరసింహులు, ఉపాధ్యక్షులుగా వి.తిరుపతయ్య, ఖాజమైనోద్దిన్, ఎస్టీవో రాజు, కోశాధికారిగా డాక్టర్ వేముల శేఖరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఖదీర్, జాయింట్ […]

Read More