సారథి ప్రతినిధి, జగిత్యాల: ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్ఫూర్తితో తాము కూడాజగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యెన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి పొన్నం లావణ్య తెలిపారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలో పలువురికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, లావణ్య మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు ఎల్ఎం […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. శుక్రవారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. గ్రామ, మండలస్థాయిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరారు. నీడనిచ్చే మొక్కలు, పూలమొక్కలు, ఔషధం(హెర్బల్) మొక్కలను పెంచి వచ్చే హరితహారంలో నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైకుంఠధామం పనులను పూర్తయ్యేలా […]
సారథి, వేములవాడ: ప్రతి సంవత్సరం మృర్గశిర కార్తెలో బోనాల పండగ జరుపుకోవడంతో పాటు పెద్దమ్మ, దుర్గమ్మ దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే శుక్రవారం బోనాల పండగను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవార్ల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ కులస్తుల బోనాల వేడుక సందర్భంగా అమ్మవార్లను ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు.
సారథి, వేములవాడ: పేదల పెన్నిధి, నిస్వార్థసేవాపరుడు, మనసున్న మారాజు, టీఆర్ కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట రామ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం వేములవాడ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజన్న ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలో వంద మంది యాచకులకు అన్నదానం చేశారు.
సారథి, పెద్దశంకరంపేట: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దశంకరంపేట ఎంపీడీవో రాంనారాయణ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆయాశాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో నర్సరీల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మురికి కాల్వలు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజుద్దీన్, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మియావాకి ప్లాంటేషన్ ను శుక్రవారం కలెక్టర్ ఎల్.శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను పెంచేలా జపాన్ మియావాకీ పద్ధతిలో నాటడం ద్వారా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానంతో ప్రతి పట్టణ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో నాటి చిట్టడవులను […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని బూరుగుపల్లి, కొలపల్లి తదితర గ్రామాల్లో నర్సరీలను ఈజీఎస్ ఏపీవో సుధాకర్ శుక్రవారం పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూ్ల్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన విద్యావలంటీర్లకు 25కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పంపిణీ చేశారు. విద్యావలంటీర్లు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతుంటే.. పాలకులు మాత్రం అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని విమర్శించారు. విద్యావలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేవైఎం జిల్లా […]