Breaking News

Month: May 2021

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

– అడిషనల్ ఎస్పీ సందెపొగు మహేందర్ సారథి సిద్దిపేట, ప్రతినిధి: ప్రజలు ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలని అడిషినల్ ఎస్పీ సందెపొగు మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ ఆర్డీవో, ఏఎస్పీ డివిజన్ పరిధిలోని లాక్ డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించి బయట తీరగొద్దన్నారు. డివిజన్ ప్రజలంతా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే తమ […]

Read More
ప్రాణం పోయినా అంబులెన్స్ స్పందించలె..

ప్రాణం పోయినా అంబులెన్స్ స్పందించలె..

  • May 17, 2021
  • Comments Off on ప్రాణం పోయినా అంబులెన్స్ స్పందించలె..

సారథి ప్రతినిధి, సిద్దిపేట: ఓ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడాలని వేడుకున్నా అంబులెన్స్ సకాలంలో స్పందించలేదు. సిద్దిపేట జిల్లా కొహెడ మండల కేంద్రానికి చెందని వేల్పుల బాలవ్వ సోమవారం తన ఇంటి ఆవరణలోని నీళ్ల ట్యాంక్ మూతపై ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా, ఓ గంట తర్వాత అంబులెన్స్ వస్తుందని సిబ్బంది చెప్పారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలవ్వ మృతిచెందింది. దీంతో ఆమెను […]

Read More
కరోనా రోగులకు ఏపీఆర్ ట్రస్ట్ భరోసా

కరోనా రోగులకు ఏపీఆర్ ట్రస్ట్ భరోసా

సారథి, రామయంపేట: కరోనా బాధితులకు అందె ప్రతాప్ రెడ్డి (ఏపీఆర్) ట్రస్ట్ అండగా ఉంటుందని కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు అన్నారు. అందె ప్రతాప్ రెడ్డి సహృదయంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపు మేరకు శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. వారిలో మనోధైర్యం కల్పించడం కోసం ట్రస్ట్ ముందుకొచ్చిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎండీ అబ్దుల్, […]

Read More
అభాగ్యులకు అన్నదానం

అభాగ్యులకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయం ముందు రోడ్డు మీద తిరిగే అభాగ్యుల కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు శనివారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి రాజరాజేశ్వర దేవస్థానం వారు అన్నదానం చేశారు. వారికి మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలా భోజనం పెట్టనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతిర్తపు మాధవి, ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ పర్యవేక్షకులు శ్రీరాములు, […]

Read More
స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

సారథి ప్రతినిధి, సిద్దిపేట: కారును పార్కింగ్ చేసి స్కూటీపై అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేశాడు. హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ (గోదాంగడ్డ)కు చెందిన సదరు వ్యక్తి స్కూటీపై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి స్కూటీని చెక్ చేయగా అందులో మద్యం […]

Read More
రూల్స్ పాటించని షాపులకు జరిమానా

రూల్స్ పాటించని షాపులకు జరిమానా

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని పలు షాపుల యజమానులకు శనివారం ఎస్సై నరేందర్ జరిమానా  విధించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా ప్రతిఒక్కరూ పాటించాలని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన కోరారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ ఈవో విఠల్, పోలీస్ […]

Read More
డెంగీని తరిమేద్దాం

డెంగీని తరిమేద్దాం

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: డెంగీ నివారణను మనం మన ఇంటి నుంచే మొదలుపెడదామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దోమల నివారణతోనే వ్యాధిని నివారించడం సాధ్యమవుతుందని, ఇంటి ఆవరణలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. మే16న జాతీయ డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీసు ఆవరణలో బ్యానర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీపై జిల్లా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని […]

Read More
కరోనా బాధితురాలికి ఆశ్రయం

కరోనా బాధితురాలికి ఆశ్రయం

సారథి, రామడుగు: మానవత్వం ఇంకా బతికే ఉందన్నదానికి ఈ సాయమే నిదర్శనం. కరోనా బాధితురాలిని అద్దె ఇంట్లో నుంచి గెంటివేస్తే వారికి ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు ఓ మంచి మనిషి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో కరోనా బారినపడిన కుటుంబానికి అద్దెకు ఇచ్చిన యజమాని తమ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వెంటనే ఆ కుటుంబానికి సర్పంచ్ సత్యప్రసన్న చేయూత ఇచ్చారు. రెండ్ల మల్లేశం ఆ కుటుంబ పరిస్థితిని వారికి తీసుకుపోవడంతో నిర్మాణదశలో ఉన్న […]

Read More