Breaking News

Day: May 30, 2021

జూన్ 15 దాకా లాక్ డౌన్

జూన్ 10 దాకా లాక్ డౌన్.. టైం మినహాయింపు

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం పదిరోజుల పాటు అనగా.. జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సమావేశానికి రాష్ట్రమంత్రులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు […]

Read More
‘ఉష’ను హత్యచేసిన వారికి శిక్షించాలి

ఉష హంతకులను శిక్షించాలి

సారథి, అచ్చంపేట: మహబూబాబాద్ జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర ఈశ్వర్ లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి తక్షణం ఆదుకోవాలని కోరారు. ఆదివారం అయన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని గిరిజన భవన్ లో మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ధర్మరాంతండాకు చెందిన గిరిజన బాలిక ఉషను కిరాతకంగా హత్యచేశారని, నిందితులను వెంటనే […]

Read More
అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్

అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్

సారథి, రామడుగు: బీజేపీ అధికారంలోకి వస్తే అచ్చే దిన్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఏడేళ్ల పాలన చూస్తే సచ్చేదిన్ లాగా ఉందని కాంగ్రెస్ బీసీసెల్ చైర్మన్ పులి ఆంజనేయులు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తప్పుడు వాగ్దానాలతో దేశ ప్రజలను పక్కదోవపట్టించారని విమర్శించారు. ప్రతి పేదవాడి అకౌంట్లోకి రూ.15లక్షలు, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకొస్తామని తప్పుడు ప్రచారంతో రెండోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కరోనా […]

Read More
పండ్లు, మాస్కులు పంపిణీ

పండ్లు, మాస్కులు పంపిణీ

సారథి, వేములవాడ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏడేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలాధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్యర్యంలో పేదలు, రైతులు, హమాలీలకు సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీనవీన్ యాదవ్ పాల్గొన్నారు. మండలంలోని ఫాజిల్ నగర్, తుర్కషినగర్, వట్టెంల, నమిలిగుండుపల్లి, నుకలమర్రి గ్రామాల్లో సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం […]

Read More
నకిలీ విత్తనాల పట్టివేత

నకిలీ విత్తనాల పట్టివేత

సారథి, మల్దకల్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై దృష్టిపెట్టారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఎస్సై శేఖర్ తన సిబ్బందితో పక్కా సమాచారంతో దాడులు చేసి 30 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. రైతులకు ఎవరు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు..

Read More
దేశం గర్వించదగ్గ ప్రధాని మోడీ

మోడీ దేశం గర్వించదగ్గ ప్రధాని

సారథి, చొప్పదండి: సాహసోపేతమైన నిర్ణయాలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న నరేంద్రమోడీ దేశం గర్వించదగిన ప్రధాని అని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ కొనియాడారు. ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చొప్పదండి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో పలు వార్డుల్లోని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, మాస్క్ లు, సానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చొప్పదండి పట్టణ ప్రధాన కార్యదర్శులు బత్తిని […]

Read More
కరోనా పేషెంట్లకు పండ్లు పంపిణీ

కరోనా పేషెంట్లకు పండ్లు పంపిణీ

సారథి, జగిత్యాల రూరల్: నరేంద్రమోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదేశాల మేరకు కొవిడ్ పేషెంట్లకు పండ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల రూరల్ మండల ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి రాజిరెడ్డి, రురల్ మండల కోశాధికారి మెడపట్ల లక్ష్మణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పడిగెల మహిపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు వంగ మధుకర్ రెడ్డి, […]

Read More
గానుగ నూనె తయారీ కేంద్రం ప్రారంభం

గానుగ నూనె తయారీ కేంద్రం ప్రారంభం

సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కట్టె గానుగ ద్వారా నూనె తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీనిధి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇస్తూ ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ […]

Read More