Breaking News

Day: May 18, 2021

ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారుచేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ  వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ […]

Read More
కరోనా కిట్లు పంపిణీ

కరోనా కిట్లు పంపిణీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కరోనాతో బాధపడుతున్న వారికి ముక్తా ఫౌండేషన్, వేములవాడ పట్టణాభివృద్ధి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మంగళవారం 50 కిట్లను పంపిణీ చేశామని అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ తెలిపారు. బాధితులకు ఈ కిట్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 14 రోజులకు సరిపడా మందులు ఉంటాయని పేర్కొన్నారు. అవసరమైనవారు శ్రీనివాస్ ఫోన్ నం.09248061 999 కు సంప్రదించాలని సూచించారు.

Read More
కరోనాతో యువకుడి మృతి

కరోనాతో యువకుడి మృతి

సారథి, పెద్దశంకరంపేట: కరోనాతో యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని జంబికుంట గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యువకుడు మంగళవారం ఉదయం స్థానిక  ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలుగు పాజిటివ్ కేసులు ఒకేరోజు 25 మందికి పరీక్షలు చేయగా అందులో నాలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ […]

Read More
మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీకి ఉంటే కరోనా విషయంలో ఈ పరిస్థితి ఉండేదా? అని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం రామడుగు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మాట కూడా ఎత్తకపోవడం జిల్లా ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా ఎమ్మెల్యేలు కనీసం జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల […]

Read More
30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా దృష్ట్యా అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈనెల 30వ తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులతో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో […]

Read More
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట్ లో ప్రతి లచ్చయ్య ఇటీవల కరోనతో మృతిచెందాడు. కుటుంబాన్ని ఆదుకునేందుకు యువకులు సేకరించిన రూ.40వేలను మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీ ఎడవెళ్లి నరేందర్, ఉపసర్పంచ్ ఎడవెళ్లి మధుసూదన్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై విజయ్, సిద్దార్థ, పురాణం రమేష్, టేకు రాజేశం పాల్గొన్నారు.

Read More
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

– అడిషనల్ ఎస్పీ సందెపొగు మహేందర్ సారథి సిద్దిపేట, ప్రతినిధి: ప్రజలు ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలని అడిషినల్ ఎస్పీ సందెపొగు మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ ఆర్డీవో, ఏఎస్పీ డివిజన్ పరిధిలోని లాక్ డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించి బయట తీరగొద్దన్నారు. డివిజన్ ప్రజలంతా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే తమ […]

Read More