Breaking News

Day: May 7, 2021

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

సారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ […]

Read More
సర్వేను పరిశీలించిన సర్పంచ్

సర్వేను పరిశీలించిన సర్పంచ్

– రేణికుంటలో ఇంటింటి సర్వే… గ్రామస్తులకు పలు సూచనలు చేసిన సర్పంచి సారథి, కరీంనగర్ ప్రతినిధి: లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని రేణికుంట సర్పంచి బొయిని కొమురయ్య అన్నారు. ఈ సందర్భంగా శక్రవారం గ్రామంలో నిర్వహించిన ఇంటింటా సర్వేను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని ఎవ్వరికైన కొవిడ్ సింటమ్స్ అయిన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.  వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు నిర్భయంగా […]

Read More
ప్రభుత్వానికి ‘జైభీమ్​యూత్’​ విజ్ఞప్తి

ప్రభుత్వానికి ‘జైభీమ్​ యూత్’​ విజ్ఞప్తి

సారథి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ అన్ని కార్పొరేట్​ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని జైభీమ్​యూత్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సెకండ్​వేవ్​తీవ్రతలో జనం పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటివేషన్​సరిపడా దొరకడం లేదని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో కొవిడ్​రోగుల ప్రాణాలు నిలిపే రెమిడెసివర్​ఇంజక్షన్ల కొరత తీవ్రత ఉందని, బ్లాక్ మార్కెట్​ దందాపై ఉక్కుపాదం […]

Read More
కరోనా భయం.. క్యూ లైన్ లో చెప్పులు ఉండటమే నయం!

కరోనా భయం.. క్యూ లైన్ లో చెప్పులు ఉండటమే నయం!

  • May 7, 2021
  • Comments Off on కరోనా భయం.. క్యూ లైన్ లో చెప్పులు ఉండటమే నయం!

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పల్లె నుంచి పట్నం వరకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఓ వైపు వైరస్ విజృంభణ మరోవైపు కూలినాలి పని చేసుకోకుంటే పూటగడవకపోవడంతో కుటుంబంలో ఎవరైనా బయటకెళ్లాలంటే కుటుంబం గుండెల్లో…తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొవాల్సి వస్తుందాయే. మహమ్మారి భయానికి కరోనా వ్యాధి లక్షణాలున్న వారు పట్టణాలతో పాటు గ్రామాల ప్రజలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్నారు. ఎవరికి ఉందో […]

Read More
దేశాన్ని కాపాడుకుందాం రండి..!

దేశాన్ని కాపాడుకుందాం రండి..!

కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతోంది. చాలా కోట్ల వ్యాక్సిన్లు అందక, ఆక్సిజన్​ దొరక్క జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ సహా, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే సంపూర్ణ లాక్​ డౌన్​ దిశగా వెళ్లాయి. కొవిడ్​దెబ్బకు క్రికెట్​మెగాఈవెంట్​ఐపీఎల్​14వ సీజన్ను బీసీసీఐ రద్దుచేసింది. దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మేమున్నామని.. టీమిండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ, స్టార్​ హీరోయిన్​అనుష్క దంపతులు ముందుకొచ్చారు. కొవిడ్ బాధితులకు భారీవిరాళం ప్రకటించారు. రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు విరుష్క దంపతులు తెలిపారు. […]

Read More
మిల్కీ బ్యూటీ రూట్​ మార్చిందా?

మిల్కీ బ్యూటీ రూట్​ మార్చిందా?

అద్భుతమైన నటన, డాన్స్​తో గ్లామరస్​పాత్రలో ఒదిగిపోయే మిల్కీ బ్యూటీ తమన్నా రూటు మార్చే ప్రయత్నంలో ఉందట. తెరపై గ్లామర్ డోస్‌కు గుడ్​బై చెప్పి.. కాస్త డిఫరెంట్​ రోల్​ చేయాలని నిర్ణయం తీసుకుందని టాక్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పోటీని తట్టుకొని తెరపై నిలబడాలంటే ఈ తరహాలు సినిమాలు చేయడమే బెటరని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తమన్నా ‘ఆహా’లో రూపొందిన ‘లెవన్త్ అవర్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి మార్కులు కొట్టేసింది. త్వరలో ‘హాట్‌స్టార్’లో వచ్చే ‘నవంబర్‌ స్టోరీ’తో పాటు […]

Read More
ఈటల వెంటే నడుస్తాం

ఈటల వెంటే నడుస్తాం..

ముదిరాజ్ సంఘం జిల్లా యువ నాయకుడు హరికృష్ణ సారథి, బిజినేపల్లి: మాజీమంత్రి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అండగా నిలుస్తుందని సంఘం జిల్లా నాయకులు హరికృష్ణ ముదిరాజ్ తెలిపారు. గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఈటలను కలిశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ను కక్ష సాధింపుతో మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన […]

Read More
బాలయోగి ఇక లేరు

బాలయోగి ఇక లేరు

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురంలో బాలయోగి శివనారాయణస్వామి కన్నుమూశారు. స్వామివారు 76 ఏళ్లుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శివనారాయణ స్వామి ఇక లేరనే వార్తను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివనారాయణ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు విశేషసంఖ్యలో తరలివచ్చేవారు. స్వామివారు లేక లేరని భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read More