నేటి రాశిఫలాలు
29 ఏప్రిల్ 2021
గురువారం
మేషం: బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబపెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూరప్రయాణాల ద్వారా శారీరక శ్రమ కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమఅధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. మీ శ్రీమతి గారితో ఉల్లాసంగా గడుపుతారు. సమయానికి ధనం అందక అవస్థలు పడుతారు. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదురవుతాయి.
వృషభం: ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొంటారు. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. విద్యార్థులు భయాందోళనలు వీడి మనోధైర్యంతో శ్రమించాలి. రుణవిముక్తులవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
మిథునం: ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉపాధ్యాయులకు బాధ్యతలతో పాటు పనిభారం కూడా అధికమవుతుంది. కుటుంబసభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక కొంత నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వాతావరణంలోని మార్పు వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పనులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి.
కర్కాటకం: భూసంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలు తగదు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి ఉంటుంది. ఇంటాబయట ఆదరణ పెరుగుతుంది. అన్నిరంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వాహనాలు కొంటారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తిచేస్తారు. పరిచయం లేనివారితో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. సంప్రదింపులు, వ్యవహారాల ఒప్పందాలకు అనుకూలం.
సింహం: ఒక వ్యవహారం కోసం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. క్యాటరింగ్ పనివారికి కలిసిరాగలదు. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. స్నేహితుల నుంచి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మిత్రులను కలుసుకుంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
కన్య: ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు అధికమవుతాయి.
తుల: కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలిస్తుంది. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తలెత్తగలవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
వృశ్చికం: చేయని పనికి సన్నిహితుల నుంచి నిందలు ఎదుర్కొంటారు. కొత్త వ్యాపారాలు, సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదాపడతాయి. వృథా ఖర్చులు చేస్తారు. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్, వైద్యకోర్సుల్లో అవకాశం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.
ధనుస్సు: స్థిరాస్తి మూల ధనం అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలసొస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించినా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధన వ్యయం విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటాబయట ప్రశాంతత నెలకొంటుంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు.
మకరం: ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పాత రుణాలను తీరుస్తారు. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగుల విషయంలో అధికారుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కుంభం: ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి ఉంటుంది. నూతన రుణాలు తీసుకుంటారు. దూర ప్రయాణం చేసే సూచనలు ఉన్నవి. బంధువులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. సలహా కంటే సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. పాత మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు.
మీనం: కీలక వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. సన్నిహితుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. భూసంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులకు అదనపు బాధ్యతలు విశ్రాంతి లోపం. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వృత్తుల వారికి బాధ్యతలు పెరుగుతాయి.
:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్నం.95020 59649