సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. సోమవారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎన్మన్ బెట్ల, జవాయిపల్లి, సింగోటం కొండ్రావుపల్లి, కల్వకోల్, కుడికిళ్ల గ్రామాల్లో పర్యటించి యువకులు, విద్యార్థులకు జ్ఞాన యుద్ధభేరి సభ ఆవశ్యకత, ప్రాముఖ్యత, ఉద్దేశ్యాన్ని వివరించారు. అనంతరం వారిచేత పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లను విడుదల చేయించారు. అంతకుముందు కొల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి, […]
సారథి న్యూస్, ములుగు: మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఏకలవ్య ఎరుకల గిరిజన హక్కుల పరిరక్షణ సాధన సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పాలకుర్తి విజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలపై రాష్ట్ర నలుమూలల ఎక్కడో ఒకచోట ప్రతిరోజు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించించాలని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్వొడితల షమిత ఆకాంక్షించారు. సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదని, వారంతా చైతన్యవంతులై అన్నిరంగాల్లోనూ రాణించాలన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. కొడుకుతో సమానంగా కూతుళ్లను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదురుకునే విధంగా మహిళలు […]
సారథి న్యూస్, అయిజ(మానవపాడు): నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్ఓబీసీ సెల్రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి తెలిపారు. సోమవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ఉద్యోగులంతా తిండి తిప్పలు మాని ఇబ్బందులు పడుతుంటే, కూటికి గడవక కూలికిపోతుంటే చోద్యంచూసిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల రాగానే […]
సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని ఎస్టీయూ భవన్ లో జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వతరెడ్డి హాజరయ్యారు. దేశంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా కొనియాడే సంప్రదాయం ఉందని, అయినా మహిళలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందించే సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయినులు సుమలత, సునిత, సుధారాణి, లవనిక, లలిత, రాజేశ్వరిని అవార్డులతో సత్కరించారు. […]
సారథి న్యూస్, వెంకటాపూర్: కనుపాపల తలచి, ఆత్మీయతను పంచి, కుటుంబం కోసం అహర్నిశలు కష్టించే స్త్రీమూర్తిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సర్వర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మహిళామణులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్వర్ ఫౌండేషన్ వ్యస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది, పోలీసు స్టేషన్ లో మహిళా పోలీస్కానిస్టేబుళ్లు, జవహర్ నగర్ పెట్రోల్ బంకులో […]
సారథి న్యూస్, మానవపాడు: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీమంత్రి, జి.చిన్నారెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ యూత్ యువ నాయకుడు వేల్పుల రవి కోరారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి జరగాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు జి.చిన్నారెడ్డికి వేయాలని కోరారు. కార్యక్రమంలో వేల్పుల రవి, మురళిగౌడ్, నేతాజీ గౌడ్, మాజీ సర్పంచ్ సుంకన్న, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి మే 30న ప్రవేశపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్నంబర్, ఆధార్నంబర్ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.100 కాగా, 2020–21 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుకున్నవారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఫలితాల అనంతరం మెరిట్ ఆధారంగా విద్యార్థులకు గురుకులంలో అడ్మిషన్ ఇస్తారు. మరిన్నివివరాలకు […]