Breaking News

Day: February 25, 2021

క్రేన్​పడి ఇద్దరు రైతుల మృత్యువాత

క్రేన్​ పడి ఇద్దరు రైతుల మృత్యువాత

బల్లూనాయక్ తండాలో విషాదం సారథి న్యూస్, హుస్నాబాద్: బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ ​పైనపడి ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో గురువారం చోటుచేసుకుంది. హుస్నాబాద్ ఎస్సై ఎస్. శ్రీధర్ కథనం మేరకు.. ఇదే తండాకు చెందిన లావుడ్య దుర్గ, దేవోజికి సంబంధించిన వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ విరిగి బావిలో పడిపోయింది. దీంతో బావిలో పనిచేస్తున్న నలుగురి మీద క్రేన్ పడి లావుడ్య […]

Read More
ముమ్మరంగా టీఆర్ఎస్​సభ్యత్వ నమోదు

ముమ్మరంగా టీఆర్ఎస్​ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యేమ దుర్గపతి ఆధ్వర్యంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ ​ప్రభుత్వం అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు ఎల్లబోయిన బాబు, నల్ల యాదగిరి, నల్ల కృష్ణ, ముండ్రాతి ఆంజనేయులు పాల్గొన్నారు.

Read More
దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవం

దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామంలో దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడవ వార్షికోత్సవాలను రెండు రోజులు నిర్వహించనున్నట్లు సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో మొదటిరోజు చండీహోమం, కుంకుమార్చన, పుష్పార్చన తో పాటు శనివారం అన్నదానం, పూజ బోనాలు నిర్వహిస్తారు. మండల ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు కోరారు.

Read More
మోడీ స్టేడియంలో రికార్డుల మోత

మోడీ స్టేడియంలో రికార్డుల మోత

అహ్మదాబాద్‌: మోతేరా స్టేడియంలో రికార్డుల మోత మోగింది. స్పిన్‌ బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌కు దారుణ ఓటమి తప్పలేదు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య గుజరాత్​లోని అహ్మదాబాద్(మోతేరా) ​నరేంద్రమోడీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన డే అండ్​ నైట్ ​పింక్ ​బాల్ ​మూడవ టెస్ట్​మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​జట్టును టీమిండియా 112 పరుగులకే ఆలౌట్​చేసింది. అనంతరం బ్యాటింగ్​చేపట్టిన భారత జట్టు 145 పరుగులు చేయగలిగింది. ఓపెనర్​రోహిత్​శర్మ […]

Read More
పోతారం గ్రావిటీ నుంచి నీళ్లివ్వాలి

పోతారం నుంచి నీళ్లివ్వాలి

సారథి న్యూస్, కోడిమ్యాల: జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పోతారం రిజర్వాయర్​ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందిస్తామని సాక్ష్యాత్తు మంత్రులే వచ్చి హామీలిచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ పనులను ప్రారంభించలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం కోడిమ్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోతారం రిజర్వాయర్ మత్తడి మూడు మీటర్లకు పెంచి ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. ఎంతసేపూ సీఎం కేసీఆర్​ ఇక్కడి నుంచి నీళ్లను తీసుకెళ్లి తన సొంత వ్యవసాయ […]

Read More
కొట్రలో మినీబ్యాంకు ప్రారంభం

కొట్రలో మినీబ్యాంకు ప్రారంభం

  • February 25, 2021
  • Comments Off on కొట్రలో మినీబ్యాంకు ప్రారంభం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో గురువారం ఎస్​బీఐ కస్టమర్​సర్వీస్ ​పాయింట్​(మినీ బ్యాంకు)ను కల్వకుర్తి బ్రాంచ్ ​మేనేజర్ శివశ్రావణ్​ కుమార్ ​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊరులోనే నగదు పొందే సదుపాయాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాతాదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్​రావు, బీజేపీ నాయకుడు జూలూరి బాలస్వామి, వార్డు సభ్యులు కొప్పు హరిశ్చంద్రప్రసాద్, పొనుగోటి విష్ణువర్ధన్​రావు, నిర్వాహకులు సిద్ధు, […]

Read More
ఎన్నికల డ్యూటీని జాగ్రత్తగా నిర్వర్తించాలే

ఎన్నికల డ్యూటీని జాగ్రత్తగా నిర్వర్తించాలే

సారథి న్యూస్, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీని తమకు కేటాయించిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. విధుల పట్ల ఏవైనా అనుమానాలు తలెత్తితే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మార్చి 2న పీవో, ఏపీవోలకు మొదటి విడత, 9న రెండో విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ లో […]

Read More
పంట సాగులో ఎరువులు తగ్గించండి

పంట సాగులో ఎరువులు తగ్గించండి

సారథి న్యూస్, రామాయంపేట: రైతు వేదికలను రైతుశిక్షణ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సతీష్ సూచించారు. మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గురువారం రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలో యూరియాను తగ్గించేయాలని సూచించారు. తక్కువ మోతాదులో వాడితే పంటకు నష్టం తగ్గి.. మంచి దిగుబడి వస్తుందన్నారు. అలాగే పంటలకు తెగుళ్లు వస్తే వాటికి సరిపడా మందులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, […]

Read More