Breaking News

Day: February 3, 2021

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

సారథి న్యూస్, హుస్నాబాద్: యువతకు క్రీడలు చాలా అవసరమని, గ్రామీణ ఆటలు బాగా ఆడించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోహెడలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్​వీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను మంత్రి హరీశ్ రావు బుధవారం వీక్షించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్​ బౌలింగ్ చేయగా, మంత్రి బ్యాటింగ్ చేస్తూ.. వినూత్నరీతిలో షాట్లు కొట్టి అక్కడి వారందరినీ అలరించారు. ఈ […]

Read More
పంట మార్పిడితో రైతులకు మేలు

పంట మార్పిడితో రైతులకు మేలు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: రైతులు ఒకే రకం పంట పండించకుండా పంట మార్పిడి నేర్చుకోవాలని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం గవ్వలపల్లిలో రైతువేదికలో అపరాలు, నూనెగింజల పంటలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీచేశారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించడంతో పాటు, మొట్టమొదటి […]

Read More
క్రికెట్​ కప్​ చాంపియన్​ బిజినేపల్లి

క్రికెట్​ కప్​ చాంపియన్​ బిజినేపల్లి

సారథి న్యూస్​, బిజినేపల్లి: బిజినేపల్లి మండలంలోని వెలుగొండ గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మొదటి బహుమతి పొందిన బిజినేపల్లి క్రికెట్ జట్టుకు కప్​ను ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ బుధవారం అందజేశారు. ద్వితీయ బహుమతి లట్టుపల్లి క్రికెట్ జట్టుకు బహుమతులు ప్రదానం చేశారు. విన్నర్​కు రూ.10,116 నగదు, రన్నర్ జట్టుకు రూ.5,116 నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కురువమ్మ, ఎంపీటీసీ సరోజనమ్మ ఉపసర్పంచ్ నాగేశ్, టీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, మల్లేష్, యువజన సంఘం నాయకులు […]

Read More
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బర్తరఫ్​చేయాలి

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్​ చేయాలి

సారథి న్యూస్, వాజేడు: ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్​ చేయాలని ఎమ్మార్పీఎస్ వాజేడు మండల ఇన్​చార్జ్ వావిలాల స్వామివారి గవర్నర్​ను కోరారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికిల్ల వేణుమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతర్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కులాలను బట్టి సమర్థులు, అసమర్థులుగా […]

Read More
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

సారథి న్యూస్, పస్రా: ములుగు జిల్లా పస్రా గ్రామంలో బుధవారం గండికోట నవీన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.14వేల చెక్కును టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి అందజేశారు. ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు చందర్ రాజు, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, వార్డు సభ్యులు శ్యాం, పున్నం చందర్, రాజశేఖర్, గజ్జి మల్లికార్జున్, పట్టపు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ డీపీవో తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శుల వివరాలను సూపరింటెండెంట్ రాజమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రియాజుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ చక్రధర్, సిబ్బంది తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Read More
కళ్యాణలక్ష్మి పేదలకు వరం

కళ్యాణలక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో 84 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను బుధవారం ఆయన అందజేశారు. సీఎం కేసీఆర్​కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1.16లక్షలు అందజేస్తున్నారని తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థినిపై లక్షలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ డీపీవో తరుణ్ కుమార్, రైతుబంధు సంగారెడ్డి జిల్లా […]

Read More
తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక

తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను పదిమందికి చేరవేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక అశోక్ అన్నారు.మెదక్​ జిల్లా నిజాంపేట మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ పండుగలను ప్రపంచం నలుమూలలకు తెలియజేయడంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఎనలేని కృషిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ శేఖర్, నిజాంపేట జడ్పీటీసీ పంజా […]

Read More