Breaking News

Month: January 2021

ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’

ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మండలంలోని అభివృద్ధి పనులపై డీఆర్డీవో శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తంచేశారు. శుక్రవారం మండలంలోని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంతో పాటు ఉపాధి హామీ, ఐకేపీ ఆఫీసులను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సముదాయ కార్యాలయం ముందున్న మొక్కలకు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మితో కలిసి నీళ్లు పట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం హరితహారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ఫ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీడీవో గణేష్ రెడ్డి […]

Read More
ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

సారథి న్యూస్, రామాయంపేట: బీసీల అదృష్టం.. మన నుదిటి గీతలో చేతి రాతల్లో లేదని.. మనం వేసే ఓట్లలోనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం మెదక్ ​జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహన్ని ఆవిష్కరించారు. మనిషిని మనిషిగా చూడాలని.. మనిషిగా గౌరవించాలని కలలు గన్న గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. ఓట్లంటే తెల్లకాగితం.. కంప్యూటర్ బటన్ […]

Read More
నిరుద్యోగభృతి హర్షణీయం

నిరుద్యోగభృతి హర్షణీయం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: టీఆర్ఎస్​ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ యువ నాయకులు అత్వెల్లి నాగరాజు అన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన తమ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. నిరుద్యోగుల కోసం భృతి ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ప్రతిపక్షాలు చేసే అర్థరహితమైన విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో కనిపించని నాయకులు ఉద్యమకారులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

Read More
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

మహబూబాబాద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం ఆరుగురి దుర్మరణం‌‌.. పెళ్లింట విషాదఛాయలు సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి.. మంత్రుల విచారం సారథి న్యూస్, మహబూబాబాద్: మరో పది రోజుల్లో కూతురు పెళ్లి.. కొత్త వస్త్రాలు కొనేందుకు వెళ్లిన ఆ కుటుంబం ఇంటికి తిరిగిరాలేదు. శుభలేఖలతో బంధువుల వద్దకు వెళ్లాల్సిన పెళ్లింటి వారు విగతజీవులుగా మారారు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్​ జిల్లా గూడురు మండలం ఎర్రకుంటతండాకు […]

Read More
ఇంటింటికీ ఇంటర్​నెట్​

ఇంటింటికీ ఇంటర్​నెట్​

త్వరలోనే ఫైబర్​గ్రిడ్ ​ప్రాజెక్టు పూర్తి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఇంటిని ఇంటర్​నెట్​తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేయనున్నట్లు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఫైబర్​గ్రిడ్ ​ప్రాజెక్టుతో భవిష్యత్​లో 5జీ టెక్నాలజీ వంటి సేవలు మారుమూల ప్రాంతాలకు అందుతాయని వివరించారు. శుక్రవారం ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ నిర్వహించిన చార్జి గోస్ట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవల […]

Read More
త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ

త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ

సారథి న్యూస్, హైదరాబాద్​: రాష్ట్రంలో త్వరలోనే మరో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నామని మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే 1.31లక్షల ఉద్యోగాలను భర్తీచేశామన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్ ​సమస్య లేదన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. దేశంలోనే పారిశ్రామిక రంగానికి సరిపడా కరెంట్​ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సమావేశంలో […]

Read More
ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర

ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర

సారథి న్యూస్​, మానవపాడు: అయోధ్య నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో రాముడి ప్రతిమతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జనహిత, హిందువాహిని ఆధ్వర్యంలో కోలాటాలు వేశారు. నృత్యాలు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆద్యంతం ఊరేగింపు కన్నులపండుగా సాగింది. ఎన్నో ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల నిరీక్షణ సఫలమై భవ్య రామ మందిర నిర్మాణం అవుతున్నందున అందరూ తమవంతు సహాయ సహకారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, […]

Read More
కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

సారథి న్యూస్, ములుగు: కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఎస్​టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ​డిమాండ్​ చేశారు. గురువారం స్థానిక ఎస్టీయూ భవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సీఆర్టీ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని, హెల్త్​కార్డులను జారీ చేయాలని డిమాండ్​ చేశారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని, హాస్టల్​ బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని […]

Read More