తక్షణమే రూ.రెండువేల కోట్ల నిధులు విడుదల చేయాలి ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష సారథి న్యూస్, హైదరాబాద్: వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, దుర్భిక్షానికి నెలువైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి వందశాతం పూర్తిచేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు ఉన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శనివారం ఆర్వీఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీ పంతులు, నాయకులు ఆర్ఎం సంతోష్ కుమార్, ఆర్వీఎస్ సంస్థ ప్రతినిధులు గంగారెడ్డి, సంగమేశ్వర్, మైసయ్య, రాందాస్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, మానవపాడు: సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ సంచాలకుడు సక్రియ నాయక్ రైతులకు సూచించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దఆముదాలపాడు గ్రామంలో ‘భూసార పరీక్ష.. సుస్థిర వ్యవసాయం’పై అలంపూర్డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భావితరాలకు అవసరమైన భూములను అందిద్దామని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మానవపాడు మండల […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఒకే సర్వే నంబర్లో కొంత భూమిని అసైన్మెంట్గా చూపించడంతో శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది రైతులు తహసీల్దార్‌ను అడ్డుకున్నారు. సర్వేనం.270లో 490 ఎకరాల భూమిలో అగ్రవర్గానికి చెందిన ఒకే కుటుంబసభ్యులకు 10 ఎకరాలను పట్టా భూమిగా మార్చడం ఏమిటని నిలదీశారు. చివరికి అధికారులు రైతులను […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగంరాయ్ తండా గ్రామంలో గురువారం రాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో రెండు పూరి గుడిసెలు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు శనివారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లొరి రాజు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి నుంచే ఎమ్మెల్యేకు బాధితులు తమ స్థితిగతులను వివరించగా, అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమె భరోసా కల్పించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ […]
సారథి న్యూస్, నిజాంపేట: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట పట్టణంలో జనజాగరణ ప్రారంభ పూజాకార్యక్రమం నిర్వహించారు. రామమందిర నిర్మాణానికి అయ్యే నిధుల సేకరణ కార్యక్రమానికి అందరి నుంచి అపూర్వ మద్దతు లభించింది. కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బ సత్యనారాయణ, జిల్లా సహ సంయోజక్ బండి వెంకటేశ్వర్లు, రామాయంపేట సహ సంయోజక్ పుట్టి […]
సారథి న్యూస్, రామాయంపేట: నీటి సౌకర్యం లేని గ్రామాల్లో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించామని స్ట్రీట్ కేస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్ అనే ఎన్జీవో(హైదరాబాద్)కు చెందిన సభ్యులు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఖాసీంపూర్ ప్రైమరీ స్కూలు ఆవరణలో స్థానిక ఎస్సై ప్రకాష్ గౌడ్ చేతులమీదుగా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఖాసీంపూర్ గ్రామంలో నీటి సౌకర్యం సరిగ్గా లేదని గుర్తించి.. నిధులు సేకరించి వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ ను మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ మొత్తం 57 రకాల రక్తపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కాలంలో వైద్యులు, ఇతర సిబ్బంది అందించిన సేవలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని గుర్తుచేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు […]