Breaking News

Day: December 25, 2020

శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు

శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు

శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. అంతకుముందు భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Read More
క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్యసారథి న్యూస్​, ములుగు: క్రిస్మస్ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవులకు ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టుక ప్రపంచానికే ఓ శుభసూచికమని, ఆయన జననం ఓ సంచలనం అని కొనియాడారు. క్రీస్తు మానవాళిపై చూపిన ప్రేమ, దయ, కృప, శాంతి ప్రజలంతా ఆచరించదగినవని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా నుంచి మనల్ని విముక్తి చేసేలా క్రైస్తవులు ప్రార్థనలు చేయాలని […]

Read More
రొమాంటిక్ కపుల్

రొమాంటిక్ కపుల్

రవితేజ పోలీస్ ఆఫీసర్ గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్. ఈ మూవీలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది టీమ్. బి.మధు నిర్మాత. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘భూమ్ బద్దలు, భలేగా తగిలావే బంగారం’ పాటలు రిలీజ్ చేసిన మేకర్స్ శుక్రవారం క్రిస్మస్ సందర్భంగా మరో సాంగ్ విడుదల చేశారు. ఈ రెండు పాటలూ రవితేజ తన స్టెప్పులతో అదరగొట్టగా ఇప్పుడు రిలీజైన ‘కోరమీసం పోలీసోడా’ […]

Read More
స్టైలిష్ నితిన్

స్టైలిష్ నితిన్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న మూవీటీమ్ శుక్రవారం క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని పోస్టర్ ను రిలీజ్ చేశారు. నితిన్ కళ్లజోడు పెట్టుకుని […]

Read More
వైల్డ్ జగదీష్..

వైల్డ్ జగదీష్..

నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్​టైన్​ ‘టక్ జగదీష్’. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు. నాని నటిస్తున్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ టైటిల్ పోస్టర్ లో టక్ చేసుకుని నిల్చుని ఉన్న నాని బ్యాక్ సైడ్ లుక్ ను చూపించిన మేకర్స్.. […]

Read More
విక్రమ్​.. పెంటాస్టిక్ లుక్

విక్రమ్​.. పెంటాస్టిక్ లుక్

ఎన్ని సినిమాల ఫస్ట్ లుక్​లు రిలీజవుతున్నా విక్రమ్ సినిమాల లుక్ లో ఉండే వేరియేషన్స్ ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటాయి. విక్రమ్, అజయ్ జ్ఞానముత్తుతో ‘కోబ్రా’ సినిమాను నిర్మిస్తున్నాడు. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లాక్ డౌన్ కు ముందే ఫిబ్రవరిలో రిలీజై అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో చాలా రకాల గెటప్స్ లో కనిపించనున్న విక్రమ్ ఫస్ట్ లుక్ లో ఎనిమిది గెటప్​లను రివీల్ చేశాడు. క్రిస్మస్ సందర్భంగా ‘కోబ్రా’ సెకెండ్ లుక్ రిలీజ్ చేశారు […]

Read More
సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతిచ్చారు. విస్తృతంగా డ్రంకెన్​ డ్రైవ్ ​తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్​ వేడుకల నేపథ్యంలో ప్రతిరోజు డ్రంకెన్​ […]

Read More
వైభవంగా క్రిస్మస్​ వేడుకలు

వైభవంగా క్రిస్మస్​ వేడుకలు

సారథి న్యూస్, నెట్ వర్క్: క్రిస్మస్ ​వేడుకలు శుక్రవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. క్రైస్తవులు ఉదయం చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, పెద్దలతో ఇంటింటా కోలాహలం నెలకొంది. వరంగల్​, కరీంనగర్​, మహబూబ్​నగర్​, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఉన్న చర్చీల్లో ప్రార్థనలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు తొలి ఆరాధనతో క్రిస్మస్ సెలబ్రేషన్స్​ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజ్ భక్తులకు దేవుని వాక్యం […]

Read More