Breaking News

Day: December 1, 2020

ఓటు వేసిన ప్రముఖులు

ఓటు వేసిన ప్రముఖులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మంగళవారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కె.తారకరామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హోంమంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్​అలీ, డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి కుందన్​బాగ్​ పోలింగ్​ బూత్​లో, హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ కుటుంబసమేతంగా తమ ఓటువేశారు. అలాగే సికింద్రాబాద్ లోని ఇస్లామియా స్కూలులో డిప్యూటీ స్పీకర్​ టి.పద్మారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడ వార్డు నం.97, సెంటర్ ఫర్ […]

Read More
ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత

నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత

తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మార్క్సిస్టు దృక్పథంతో ప్రజాసమస్యలపై పాలకులను నిలదీసిన నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య(64) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నోముల 30ఏళ్లకు పైగా రాజకీయ, ప్రజాజీవితంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 1987లో జరిగిన మండల […]

Read More
పుష్కరాలకు కార్తీక శోభ

పుష్కరాలకు కార్తీక శోభ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర పుష్కరాలకు కార్తీక శోభ సంతరించుకుంది. పవిత్ర సోమవారం కావడం, పుష్కరాలు 11వ రోజు కావడంతో పలు ఘాట్లకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండల పరిధిలోని పుల్లూరు పుష్కర ఘాట్ కు తాకిడి పెరిగింది. ఇక్కడ వేలసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పరిధిలోని ఘాట్లలో నదీస్నానాలకు అనుమతి లేకపోవడంతో అలంపూర్ పుష్కర ఘాట్ కు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు నదిలో […]

Read More