Breaking News

Day: November 30, 2020

మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్‌: గ్రేటర్​ ఎన్నికల్లో మరో కీలకమైన ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. షెడ్యూల్​లో భాగంగా డిసెంబర్​1న పోలింగ్ ​జరగనుంది. 4న ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే నేతల వాగ్దానాలు, హామీలు, వాడీవేడి విమర్శల మధ్య ప్రచారం పర్వం ఆదివారం సాయంత్రం నాటికే ముగిసింది. సిటీలోని మొత్తం 15‌‌0 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం […]

Read More
 ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

సారథి న్యూస్, ఏడుపాయల(మెదక్): భక్తుల కొంగుబంగారంగా విలసిల్లిన ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి […]

Read More
ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు

ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: జిల్లావ్యాప్తంగా సోమవారం కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా భక్తులు పలు ఆలయాల్లో విశేషపూజలు జరిపించారు. వత్రాలు, నోములు ఆచరించారు. దీపారాధన, దీపదానం, ఆకాశ దిపోత్సవం, అర్చనలు, అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని రామాలయంలోశ్రీ రామసహిత వెంకట సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ప్రాత:కాలంలోనే పరమశివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ఆలయంలో దీపారాధనను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన […]

Read More