Breaking News

Day: November 25, 2020

పులకించిన పుల్లూరు

పులకించిన పుల్లూరు

లక్ష తులసి దళాలతో అర్చన జ్యోతివాస్తు విద్యాపీఠం పుష్కర పూజలు సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర నది పుష్కర మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పుల్లూరు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో పీఠాధిపతి జ్యోతి వాస్తు విద్యాపీఠం సిద్ధాంత భాస్కర మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో బాసర సరస్వతి అమ్మవారికి లక్ష తులసి దళాల అర్చన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మొదట పుష్కర ఘాట్ లో సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. మహిళలు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం చెన్నకేశవ స్వామి […]

Read More
టీఆర్ఎస్​కు స్వామిగౌడ్​గుడ్​బై

టీఆర్ఎస్​కు స్వామిగౌడ్​ గుడ్​ బై

సారథి న్యూస్, హైదరాబాద్: శాసనమండలి మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్​ నేత స్వామిగౌడ్ ఆ పార్టీని వీడారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్​ మాట్లాడుతూ..బీజేపీలో చేరడమంటే తన తల్లి గారింటికి వచ్చినట్లు భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ జెండా పట్టని వారికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, తమను ఎండలో […]

Read More
రోహింగ్యాలపై తప్పుడు ప్రచారం వద్దు

‘హైదరాబాద్ కు కిషన్ రెడ్డి ఏమిచేశారు’

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో 40వేల మంది రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పాతబస్తీలో 40వేల మంది రోహింగ్యాలు ఉంటే కేంద్ర ఏం చేస్తోందని ప్రశ్నించారు. 18 నెలల కాలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏమి చేశారని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా అతీగతి లేదన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల […]

Read More

పుష్కరుడి చెంతకు భక్తజనం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి సన్నిధిలోని పుష్కర ఘాట్ కు భక్త జనసందోహం రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం రోజు ఐదో రోజుకు పుష్కరాలు చేరాయి. తెల్లవారుజామున 5గంటల నుంచే భక్తులు తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు ఆచరించి జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వరుణుడిని దర్శించుకున్నారు. సుమారు 15వేల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా వేశారు. మాననపాడు మండలం పుల్లూరు గ్రామశివారులోని తుంగభద్ర నది తీరాన ఏర్పాటుచేసిన […]

Read More
ప్రజలకు శాస్త్రీయమైన వ్యాక్సిన్

ప్రజలకు శాస్త్రీయమైన వ్యాక్సిన్

హైదరాబాద్: శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ […]

Read More