సారథి న్యూస్, తలకొండపల్లి: ప్రజాసమస్యల పరిష్కారానికి అనునిత్యం సేవలందించిన దివంగత సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలో యాదయ్య కుటుంబసభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య మృతి తనను కలచివేసిందన్నారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా తనను కలవాలని సూచించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కుటుంబసభ్యులు, […]
సారథి న్యూస్, మెదక్: జిల్లావ్యాప్తంగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. మంగళవారం జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయధికారులు, విస్తరణాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు చాలా […]
సారథి న్యూస్, బిజినేపల్లి: దుబ్బాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే మంత్రి టి.హరీశ్‌రావును రంగంలోకి దించి పోలీసులతో రఘునందన్‌రావు బంధువుల ఇంటికి పోలీసుల సహాయంతో డబ్బులు పంపించారని విమర్శించారు. మాజీ ఎంపీలు వివేక్, ఏపీ జితేందర్‌రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారని ఖండించారు. అనంతరం […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను జిల్లా అడిషనల్కలెక్టర్ మనుచౌదరి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పనులను పరిశీలించారు. రైతువేదికలను త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను వేగంగా, నాణ్యవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదికలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట బిజినేపల్లి ఎంపీడీవో హరినాథ్ గౌడ్, మంగనూర్ ఉపసర్పంచ్ చిన్నగాళ్ల […]