సారథి న్యూస్, పాల్వంచ: మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆదివారం దసరా పండగ పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. మంచి నీళ్లు ఇప్పించండి మహాప్రభో.. అని ఖాళీబిందెలతో నిరసన తెలిపారు. ‘చుట్టుపక్కల గ్రామాల అన్నింటికీ భగీరథ నీళ్లు వస్తున్నాయి. కానీ తమ ఊరుకు మాత్రం రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారు! ఎమ్మెల్యే గారు! మీరైనా మా బాధలను అర్థం […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరోనా కారణంగా 9 రోజులుగా సంబరాలు అంతంత మాత్రంగానే జరుపుకున్నా, చివరిరోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకల్లో పాల్గొన్నారు. ఏ పల్లెలో చూసినా సంబరాల ఉత్సాహమే కనిపించింది. డీజే పాటలు, డోలు వాయిద్యాలతో సందడిగా కనిపించింది. మహిళలంతా బతుకమ్మను పోయిరా.. గౌరమ్మా పోయిరా.. అంటూ సాగనంపారు.
దుబాయ్: స్కోరు తక్కువే అయినా.. ఛేదించలేక సన్‌రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన 43వ మ్యాచ్‌లో వార్నర్‌సేన ఘోరంగా ఓడిపోయింది. కింగ్స్‌పంజాబ్12 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌ను డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత […]