Breaking News

Day: October 14, 2020

తల్లడిల్లిన సిటీ

తల్లడిల్లిన సిటీ

జలదిగ్బంధంలో హైదరాబాద్ మహానగరం నిండుకుండలా హుసేన్​సాగర్​, హిమాయత్​సాగర్​ భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో కరెంట్​ కట్​ ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం హైదరాబాద్​– విజయవాడ హైవేపై రాకపోకలు బంద్​ :: ఆర్​కే, సారథి న్యూస్​, హైదరాబాద్​ ప్రత్యేక ప్రతినిధి భారీ వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకుల వణుకుతోంది.. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది.. అడుగు బయటికేస్తే ఎక్కడి డ్రెయినేజీలో కొట్టుకుపోతావేమోనన్నభయం వెంటాడుతోంది.. చాలా ప్రాంతాల్లో కరెంట్ పోయి అంధకారం అలుముకుంది. ఏ ఇల్లు చూసినా చెరువును తలపిస్తోంది.. వరద నీటితో […]

Read More

తహసీల్దార్​ నాగరాజు ఆత్మహత్య

హైదరాబాద్​: అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న కీసర మాజీ తహసీల్దార్​ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ భూ వివాదంలో నాగరాజు రూ. కోటి పదిలక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే నాగరాజు ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో రిమాండ్​ ఖైదీగా ఉన్నారు. జైలు గదిలో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు జైలు అధికారులు తెలిపారు.

Read More

మువ్వల సవ్వడి ఆగిపోయింది

హైదరాబాద్: ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభానాయుడు బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి శోభానాయుడు స్వస్థలం. ఆమె చిన్నప్పటి నుంచే వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేశారు. అనంతరం కొన్ని వేల నాట్యప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పేరు ప్రఖ్యాతలు సాధించారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. […]

Read More
భారీ వర్షం.. మెతుకుసీమ జలసంద్రం

మెతుకుసీమ జలసంద్రం

సారథి న్యూస్, మెదక్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువు లు, కుంటలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. ఎగువన సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటం తో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో మంజీరా నది భారీ వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద నిర్మించిన వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. దీంతో మంజీరా నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హల్దీ […]

Read More