సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వ్యాపారాల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న ఆంక్షలు యథాతథంగా అమలవుతాయని కమిషనర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాల్లో వ్యాపారాల నిర్వహణ సాగుతోందని, ఈ సమయం ఇలాగే ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆన్ లాక్ 4.0 మార్గదర్శకాలు కేవలం నాన్ కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టంచేశారు. మెడికల్, అత్యవసర వైద్య సంబంధిత […]
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుపై మూడు నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. అవన్నీ కల్పిత కథలేనని కొట్టిపారేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి అభయ్పేరుతో లేఖను విడుదల చేసింది. ‘గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం, తెలంగాణ, చత్తీస్‌గఢ్ ఇంటలిజెన్స్ అధికారుల కట్టు కథలతో పాటు, పోలీసులు అల్లిన నాటకం. […]
సారథి న్యూస్, మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 26వ వార్డు కాలనీకి చెందిన ఓ మహిళ నదిఅగ్రహారం వద్ద కృష్ణానదిలో స్నానం చేసేందుకు వెళ్లి కొట్టుకుపోయింది. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. ఆమె జాడ కోసం గజ ఈతగాళ్ల సాయంతో వెతుకుతున్నారు. ఎస్సై సత్యనారాయణ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మహిళా సాధిరాకత, స్వయం సమృద్ధే లక్ష్యంగా పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ప్రాసెసింగ్యూనిట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్, టీఎస్ ఐపార్డ్ లో గురువారం నిర్వహించిన వర్క్‌షాపునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టులతో జలవిప్లవం వచ్చిందన్నారు. వ్యవసాయ ఆధారిత […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్నిఅంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయపక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈనెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ మంత్రులు, విప్ లతో గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.మంత్రులు సన్నద్ధమై రావాలికరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో […]
భువనగిరి: యశోద ఆస్పత్రి యాజమాన్యం కోసమే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి ప్రజలను కాపాడేందుకు వినియోగించాలని హితవు పలికారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వసతులను తెలుసుకునేందుకు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం గురువారం భువనగిరి జిల్లా ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంతా ఉద్యోగాల కోసమే అన్న రాజేంద్రా.. ఇప్పటి […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్’ నిధికి మోడీ రూ. 2.25 లక్షల విరాళమిచ్చారు. ఈ నిధికి వచ్చిన విరాళాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. పీఎం కేర్స్ లో పారదర్శకత లోపించిందని విపక్షాలు మోడీ సర్కారుపై విమర్శలు చేసినా.. ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కింద దరఖాస్తుదారులు కోరినా దానికి బీజేపీ సర్కారు స్పందించలేదు. […]
కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ ఐటెమ్ సాంగ్స్ కు మాంచి క్రేజీ ఉండేది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ బన్నీతో సుకుమార్ ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాదే బ్యాక్ డ్రాప్ ఇస్తున్నాడు. ఇప్పటికే పుష్ప కోసం దాదాపు అన్ని ట్యూన్స్ ను రెండు మూడు వర్షన్లుగా రెడీచేసి పెట్టాడట. త్వరలోనే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.. అయితే […]