Breaking News

Day: September 2, 2020

తెలంగాణ ఎంసెట్ కు రెడీ

తెలంగాణ ఎంసెట్​ షెడ్యూల్​ ఖరారు

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబ‌ర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎగ్జామ్​ జరగనుంది. ఇందుకోసం తెలంగాణలో 79, ఏపీలో 23 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి జరిగే ఎంసెట్ కు 1,43,165 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెప్టెంబర్​3 నుంచి ఈనెల 7వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎంసెట్ నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్​సెంటర్లకు వచ్చే అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో […]

Read More
బర్త్ డే స్పెషల్..

పవన్​.. బర్త్ డే స్పెషల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రిలీజైతే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పిరియాడికల్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ కూడా ఒకటి పూర్తి చేశారు. సెప్టెంబర్​ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసి […]

Read More
ట్రీట్ అదిరింది

​ట్రీట్ అదిరింది..

పవన్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ కలలు ఈరోజు తీరాయి అనిపిస్తోంది. ఓ వైపు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్, మరోవైపు క్రిష్ జాగర్లమూడి చిత్రం తాలూకూ ఫస్ట్ లుక్, ఇప్పుడేమో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజై అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. పవన్ కెరీర్ లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మించనున్నారు. సెప్టెంబర్​ 2న […]

Read More
శ్రీశైలం పవర్​హౌస్​లో మరోసారి మంటలు

శ్రీశైలం పవర్​హౌస్​లో మరోసారి మంటలు

సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీశైలం పాతాళగంగ ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి మంటలు చెలరేగాయి. బతుకుజీవుడా అంటూ సిబ్బంది పరుగులు తీశారు. కరెంట్ ​కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెప్పారు. అయితే ప్రమాద తీవ్రతను అధికారులు పరిశీలిస్తున్నారు. లాన్​కు ఎలాంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో జెన్​కో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హతాశులయ్యారు. పొగలు కమ్ముకుంటుండడంతో […]

Read More
కరోనా వైద్యసేవలు బాగుండాలె

కరోనా వైద్యసేవలు బాగుండాలె

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని మంత్రి కె.తారక రామారావు జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతో పాటు సిరిసిల్ల పట్టణాన్ని అదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపైన కూడా మంత్రి సమీక్షించారు. సిరిసిల్లలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పరుగులెత్తించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జిల్లా అధికారులతో హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో ప​లు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో […]

Read More
ఏపీలో 10,392 కరోనా కేసులు

ఏపీలో 10,392 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం(24 గంటల్లో) 10,392 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,55,531 నమోదయ్యాయి. తాజాగా, కరోనా మహమ్మారి బారినపడి 72 మంది మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,125కు చేరింది. కోవిడ్​నిర్ధారణ పరీక్షలు 38లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజే 60,804 మెడికల్​ టెస్టులు చేయగా, ఇప్పటివరకూ చేసిన టెస్టులు 38,43,550 చేశారు. తాజాగా కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వ్యాధి నుంచి కోలుకుని […]

Read More
మహానేతకు పూలాభిషేకం

మహానేతకు పూలాభిషేకం

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్​ రాజశేఖర్​రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బుధవారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డి, విజయ మనోహరి దంపతులు తన నివాసంలో పూలాభిషేకం చేశారు. వైఎస్సార్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలాభిషేకం చేస్తే పాల కొరత వస్తుందని, పూలతో అభిషేకం నిర్వహించడంతో స్థానికులు ఎస్వీ దంపతులను అభినందించారు. వైఎస్సార్​ పేదవాడి గుండెచప్పుడు తెలిసిన ప్రజానాయకుడని కొనియాడారు. అనంతరం కర్నూలు ఎస్​టీబీసీ కాలేజీలో నిర్వహించిన వైఎస్సార్ […]

Read More
ఘనంగా వైఎస్సార్​వర్ధంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి వేడుకలు

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్​ వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్​చార్జ్​ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్​ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది […]

Read More